అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'ఆర్య' .. 'ఆర్య 2' తరువాత వస్తున్న సినిమా 'పుష్ప'. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో చిత్తూరు యాసలో అల్లు అర్జున్ మాట్లాడాడు. ఆయన స్టేజ్ మీదకి వస్తూ కూడా అదే యాసలో అభిమానులను పలకరించాడు. "ఏందబ్బా ఎట్టా ఉండారూ .. సానా దినాలైంది మిమ్మల్ని ఇట్టా గలిసి .. బావుండరా .. ఏందప్పా ఏందీ రచ్చ .. తగ్గేదే లే'. అందరికీ ఫ్యాన్స్ ఉంటే నాకి ఆర్మీ ఉంది. నా లైఫ్ లో నేను ఏదైనా సంపాదించుకున్నానంటే అది మీరే.
సినిమా విషయానికి వస్తే దేవీశ్రీ నాకు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు .. థ్యాంక్యూ దేవీ. ఒక్కొక్క పాట మామూలు పాట కాదు .. 'దాక్కో దాక్కో మేక' పాట నా ఎనర్జీ లెవెల్స్ ని పెంచేసింది. ఇక 'సామీ సామీ' పాట వినగానే నాకు మెంటలెక్కేసింది .. నాకు బాగా నచ్చిన పాట ఇది .. నిజంగా ఏం కొట్టావు సామీ అనుకున్నాను. ఆ తరువాత 'చూపే బంగారమాయెనే శ్రీవల్లీ' పాట. వింటున్నప్పుడు మీరెంత ఎంజాయ్ చేశారో, అంతకంటే ఎక్కువగా నేను ఎంజాయ్ చేశాను. ఆ తరువాత కూడా ఎక్కడా మనవాడు తగ్గలేదు. 'ఊ అంటావా మామా' అనే పాట దూసుకుపోతోంది.
ఈ ఒక్క సినిమాకి పడిన కష్టం 4 సినిమాలకి పడిన కష్టంతో సమానం. అందుకే ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే రష్మిక .. ముద్దుగా నేను క్రష్మిక అని పిలుస్తూ ఉంటాను. మనం చాలామందితో కలిసి పనిచేస్తాము .. కానీ కొంతమంది మాత్రమే మనసుకు నచ్చుతారు. నిజంగా నా మనసుకు నచ్చిన అమ్మాయి రష్మిక. తను వెరీ స్వీట్ .. వెరీ సింపుల్ .. వెరీ బ్యూటిఫుల్ .. వెరీ ఇంటెలిజెంట్ .. వెరీ టాలెంటెడ్. ఆమె వండర్ ఫుల్ ఆర్టిస్ట్ .. రాబోయే రోజుల్లో ఆమె మరో స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఇక సునీల్ .. అనసూయ ... రావు రమేశ్ .. ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. మైత్రీ బ్యానర్లో ఇంతకుముండు ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ఈ సినిమా వాళ్ల బ్యానర్లో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని చెప్పగలను. సుకుమార్ గారి విషయానికి వస్తే ఆయన గురించి ఏమని చెప్పమంటారు. ఫంక్షన్ కి ఆయన రావడం లేదని సాయంత్రం తెలిసింది .. దాంతో నా చిప్ ఆఫ్ అయిపోయింది. ఆయనను కన్వీన్స్ చేద్దామని నేను కాల్ చేస్తే, నన్నే ఆయన కన్వీన్స్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించి మా ఇద్దరిలో ఎవరికి క్రెడిట్ వచ్చినా, అది మాది. తను .. నేను వేరు కాదు .. అది మేము అంతే" అని చెప్పుకొచ్చాడు.