ఎన్ని ఉన్నా పుష్పకే నా ఫస్ట్ ఓటు!

Update: 2021-06-24 04:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మేకర్స్ గాని హీరోలుగాని అందరూ పాన్ ఇండియా వైపే దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు ఇండియాలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో అన్ని భాషలు కలిపి 50% రూపొందుతుండగా.. కేవలం తెలుగు నుండే 50% సినిమాలు రూపొందుతుండటం విశేషం. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో చిత్రం పుష్ప కూడా ఉంది. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ దశలో ఉంది. రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు.

అలాగే సినిమా కూడా అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ఇప్పటివరకు ఏ సినిమాకు పెట్టని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మైత్రి మూవీస్ వారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడిగా పాన్ ఇండియా క్రష్ రష్మిక మందన నటిస్తోంది. ఈ అమ్మడు సినిమాలో ఎంటర్ అయినప్పటి నుండి అదనపు ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రష్మిక వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఆ భాషా ఈ భాషా అనే తేడా లేకుండా వయ్యారి వీలైన ప్రతి భాషలో సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.

అయితే ఇంతకాలం కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ బ్రేక్ పడటం వలన ఇంటిపట్టునే ఉండిపోయింది పుష్ప బృందం. అయితే రష్మిక ఇతర ప్రాజెక్ట్ లకంటే తనకు పుష్పకే తన మొదటి ఓటు అంటోందట. అందుకే జులైలో ప్రారంభం కాబోతున్న తదుపరి షెడ్యూల్ కోసం ఏకంగా నెల రోజుల కాల్ షీట్స్ కేటాయించినట్లు సమాచారం. మరి ఈ సినిమాలో మొదటిసారి రష్మిక పక్కా చిత్తూరు పల్లెటూరు అమ్మాయిగా కనిపించనుంది. చూడాలి మరి ఆల్రెడీ పుష్ప సినిమా టీజర్ సోషల్ మీడియాలో ఓ రేంజి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ బృందం తదుపరి షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Tags:    

Similar News