మైత్రి భారం ఆ నలుగురి మీదే!

Update: 2018-12-02 05:15 GMT
నిర్మాణ రంగంలో అడుగుపెట్టి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద సినిమాలు తీయడం మొదలుపెట్టాక బ్యాక్ టు బ్యాక్ మూడు ఇండస్ట్రీ హిట్స్ స్టార్ హీరోస్ తో వరసబెట్టి కొట్టడంతో దిష్టి తగిలినట్టు ఉంది. ఒకేనెలలో కేవలం రెండు వారాల వ్యవధిలో సవ్యసాచి-అమర్ అక్బర్ ఆంటోనీ రూపంలో రెండు డిజాస్టర్లు మూటగట్టుకోవడం ఎవరికైనా ఇబ్బంది కలిగించే విషయమే. పైగా ఏ ఒక్కటీ కనీసం పది కోట్ల షేర్ ని కూడా అందుకోలేకపోవడం పరిస్థితిని ఇంకాస్త కిందకు తీసుకొచ్చింది. అందుకే రాబోయే సినిమాల విషయంలో అలర్ట్ అయిపోయిన మైత్రి బృందం స్క్రిప్ట్ లను మరోసారి క్షుణ్ణంగా తిరగేస్తోందని ఇప్పటికే టాక్ ఉంది.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ షూటింగ్ కాకినాడలో ఫుల్ స్వింగ్ లో ఉంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా చిత్రలహరిని ఇటీవలే మొదలుపెట్టారు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శిని-నివేతా పెతురాజ్ హీరోయిన్లు. హిట్ లేక అల్లాడిపోతున్న తేజుకి ఇది చాలా కీలకం. న్యాచురల్ స్టార్ నానితో విక్రమ్ కుమార్ తో మరో ప్రాజెక్ట్ ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లబోతోంది మైత్రి సంస్థ. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కాకుండా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజతో ఓ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది. తమిళ్ హిట్ తేరి రీమేక్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకుని కొత్త కథ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయి ఇన్ సైడ్ టాక్. మహేష్ బాబు-సుకుమార్ కాంబో మూవీకి ఇంకా టైం పట్టేలా ఉంది కాబట్టి ఈ నలుగురు ఇచ్చే హిట్స్ మైత్రికి ఎనర్జీగా మారాల్సి ఉంది. అన్ని వచ్చే ఏడాదే వచ్చేస్తాయి
   

Tags:    

Similar News