దర్శకుడు ఎంత టాలెంట్ ఉన్నవాడైనా పాత ట్రాక్ రికార్డు ఎంత ఘనంగా ఉన్నా ప్రస్తుతం ఏంటి అనే దాని మీదే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో చేసిన డైరెక్టర్లు ఈ రోజు ఉనికిని చాటుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు అంటే అపజయాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శీను వైట్ల దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. మూడు భారీ డిజాస్టర్ల తర్వాత రవితేజ కోరి మరీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని ఆశిస్తే తనలో ఏ మార్పు రాలేదని చాటడానికే అమర్ అక్బర్ అంటోనీ తీసినట్టు శీను వైట్ల మీద ఇప్పటికే విపరీతమైన కామెంట్స్ వచ్చేసాయి. కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేని దారుణమైన రన్ తో మైత్రి మూవీ మేకర్స్ కు పెద్ద షాక్ ఇచ్చింది.
దీని కంటే ఇంతకు ముందు అదే బ్యానర్ లో వచ్చి ఫెయిల్యూర్ గా మిగిలిన సవ్యసాచి ఎంతో నయం అనేలా దీని లెక్కలు కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలో శీను వైట్ల తన బాలన్స్ పేమెంట్ కి సంబంధించి నిర్మాతలను సంప్రదిస్తే మొహమాటం లేకుండా నో అనే ఆన్సర్ వచ్చిందట. రంగస్థలం లాంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ దక్కిన ఏడాదిలోనే ఇంత దారుణ పరాజయం మూటగట్టుకోవడం మైత్రి మిత్ర ద్వయానికి మింగుడు పడటం లేదు. నమ్మి కోట్ల రూపాయల బడ్జెట్ చేతిలో పెట్టి ఖర్చుకు వెనుకాడకుండా అమెరికాలో షూటింగ్ చేస్తే చివరికి ఇంత తీసికట్టు సినిమాని చేతిలో పెట్టడంపై శీను వైట్ల మీద బయటికి చూపించుకోలేని అసహనంతో ఉన్నారని ఫిలిం నగర్ టాక్.
ఇది నిజం కాదనడానికి లేదు. పైగా శీనుకి రెమ్యునరేషన్ పద్ధతిలో కాకుండా షూటింగ్ జరిగిన కాలానికి నెలకు కొన్ని లక్షల చొప్పున శాలరీ మాత్రమే ఇచ్చారని సినిమా హిట్ అయితే లాభాల్లో పర్సెంటేజ్ ఇచ్చేలా ఒప్పందం జరిగిందని కూడా మరో టాక్ ఉంది. ఒకవేళ ఇది నిజమైతే శీను వైట్ల నష్టపోయే మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మిస్టర్ టైం లో ఇలాంటి వివాదమే కొనితెచ్చుకోవడం అందరికి గుర్తే. ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత శీను వైట్ల మరో ఛాన్స్ దక్కించుకుంటే గ్రేటే అంటున్నారు సినిమా జనం.