మూడు ఇండస్ట్రీ హిట్లు - రెండు దెబ్బలు

Update: 2018-11-17 04:31 GMT
ఏ నిర్మాణ సంస్థకైనా మొదటి సినిమా ఇండస్ట్రీ హిట్ కావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకటి రెండు తీసాక అన్ని కలిసొచ్చి కాంబో కుదిరి టైం బాగుంటే అప్పుడు పడుతుంది. కానీ మైత్రి మూవీ మేకర్స్ కేసు వేరు. ఫస్ట్ మూవీకే మహేష్ బాబు లాంటి స్టార్ తో తీసే అవకాశం. అప్పటికి ఒక్క సినిమా హిట్ మాత్రమే అనుభవం ఉన్న కొరటాల శివ దర్శకత్వం. ఊరిని దత్తత తీసుకోవడం అంటే కాస్త రిస్క్ ఉన్న పాయింట్. కమర్షియల్ గా పర్ఫెక్ట్ గా డీల్ చేయడంతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యాయి. ఓవర్సీస్ తో సహా కొన్నవాళ్లందరికి మంచి లాభాలు వచ్చి పడ్డాయి.

తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మోహన్ లాల్ అరుదైన కాంబోలో  అదే దర్శకుడితో జనతా గ్యారేజ్ తీస్తే మరో బ్లాక్ బస్టర్. లెక్కలు మరోసారి సరి చేసారు. ఇక ఈ ఏడాది రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సృష్టించిన చరిత్ర మెగా అభిమానులు ఇప్పట్లో మర్చిపోవడం జరిగే పని కాదు. చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులన్నీ తన ఖాతాలో వేసేసుకుంది రంగస్థలం. ఇలా ఒకే సంస్థకు  హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్స్ రావడం చాలా అరుదు.

కానీ ఇప్పుడు మైత్రికి టఫ్ టైం వచ్చినట్టే కనిపిస్తోంది. భారీవ్యయం తో నాగ చైతన్య హీరోగా అతి కష్టం మీద మాధవన్ ను విలన్ గా ఒప్పించి చందు మొండేటి దర్శకత్వంలో తీసిన సవ్యసాచి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. రెండు వారాలు పూర్తికాకుండానే చాలా చోట్ల విపరీతమైన డ్రాప్ తో ప్లాప్ అకౌంట్ లో పడిపోయింది. ఈ రకంగా మైత్రి జైత్ర యాత్రకు మొదటి బ్రేక్ పడింది. ఇక సవ్యసాచికి కేవలం పధ్నాలుగు రోజుల గ్యాప్ తో రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ మంచి ఓపెనింగ్స్ మధ్య విడుదల చేసారు.దీనికి డిజాస్టర్ టాక్ రావడంతో మరొక ప్లాప్ మైత్రి బ్యానర్ కు తోడయ్యింది.

చైతు-రవితేజ ఇద్దరూ మంచి గ్యారెంటీ ఉన్న హీరోలే అయినప్పటికీ కథల ఎంపికతో పాటు దర్శకత్వ తప్పిదాలు పరాజయానికి కారణంగా మిగిలాయి. ఇప్పుడు ఈ రెండింటిని మైత్రి వార్నింగ్ బెల్ లా తీసుకోవాలి. వరసబెట్టి రకరకాల కాంబోలతో మైత్రి సంస్థ సినిమాల నిర్మాణంలో ఉంది. ఇకనైనా అలెర్ట్ గా ఉండకపోతే మరికొన్ని దెబ్బలు తగిలే అవకాశం లేకపోలేదు. మహేష్ బాబు సుకుమార్ లో కాంబోలో ప్లాన్ చేసిన మూవీ తప్ప మిగిలినవన్నీ హీరోల పరంగా మార్కెట్ పరంగా రిస్క్ ఉన్నవే. మరి మైత్రి సంస్థ వరసగా తగిలిన ఈ రెండు ఎదురు దెబ్బల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుందో వచ్చే సినిమాల తీర్పులు చెబుతాయి. అంత దాకా ఓపిక పట్టాల్సిందే.
Tags:    

Similar News