ఈ మధ్య మీడియం రేంజ్ హీరోలతో ప్రాజెక్టులు చేస్తూ వరసగా దెబ్బలు తింటున్న మైత్రి మూవీ మేకర్స్ అగ్ర హీరోలతో వరసగా సినిమాలు ప్లాన్ చేస్తూ మళ్ళి ట్రాక్ లోకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. భారీ అంచనాలతో ఇటీవలే వచ్చిన డియర్ కామ్రేడ్ ఫలితం కూడా నిరాశాజనకంగా ఉండటం మైత్రికి ఊహించని దెబ్బే. ఇదిలా ఉండగా తాజాగా మూడు స్టార్ అనౌన్స్ మెంట్లతో మైత్రి ఫ్యూచర్ ప్లానింగ్ గురించి బయటి ప్రపంచానికి క్లారిటీ ఇచ్చేసింది. ఇందులో విషయాలు గతంలో తెలిసినవే అయినా ఇప్పుడు పక్కా క్లారిటీ వచ్చేసింది.
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం అక్టోబర్ లో మొదలుపెట్టి నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్నారు. మహేష్ బాబుతో వచ్చే ఏడాది 2020లో మరో సినిమా ఉంటుంది. కానీ దర్శకుడు మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. వీటి తర్వాత కెజిఎఫ్ తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మరో సినిమా ఉంటుంది మూడూ దేనికవే భారీ కాన్వాస్ ఉన్నవే. ఎంత లేదన్నా ఈ మూడింటికి కలిపి మూడు వందల కోట్ల దాకా బడ్జెట్ అవుతుంది.
క్రేజ్ దృష్ట్యా ఆయా హీరోలు ఆ మొత్తాన్ని థియేట్రికల్ బిజినెస్ ద్వారానే తెచ్చే సత్తా ఉన్నవాళ్లు కాబట్టి వర్క్ అవుట్ చేసుకోవచ్చు. రిస్క్ ఎక్కువైనా ఇకపై స్టార్లతోనే ఎక్కువ సినిమాలు తీసేందుకు మైత్రి ప్లాన్ లో ఉన్నట్టు దీన్ని బట్టి అర్థమవుతోంది. సవ్యసాచి-అమర్ అక్బర్ ఆంటోనీ- డియర్ కామ్రేడ్ వైఫల్యాల తర్వాత నాని గ్యాంగ్ లీడర్ మీద మైత్రి చాలా నమ్మకంతో ఉంది. వైష్ణవ్ తేజ్ తో తీస్తున్న ఉప్పెన ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. మొత్తానికి మైత్రి స్పీడ్ పెంచడం ఖాయమనైతే క్లారిటీ వచ్చేసింది