అమావాస్యతో చిక్కుల్లో పడ్డ మైత్రిమూవీ మేకర్స్‌

Update: 2022-11-01 05:32 GMT
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న వీర సింహారెడ్డి సినిమా ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొదట ఈ సినిమాను అఖండ విడుదల అయినట్లుగా డిసెంబర్‌ లో విడుదల చేసి సెంటిమెంట్ ను వర్కౌట్‌ చేసుకుని సక్సెస్ అవ్వాలని నిర్మాతలు భావించారు.

అఖండ సినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో అందరికి తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వీర సింహా రెడ్డి సినిమా కూడా డిసెంబర్‌ లో విడుదల అయితే బాగుంటుందని నందమూరి అభిమానులు కూడా ఆశ పడ్డారు. కానీ డిసెంబర్‌ లో విడుదలకు స్వయంగా బాలయ్య ఒప్పుకోలేదట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ వారు డిసెంబర్‌ లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. మైత్రి వారే నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు.

కానీ డిసెంబర్‌ లో మైత్రి వారు అనుకున్న తేదీకి అమావాస్య ఉందట. దాంతో బాలకృష్ణ ఆ తేదీ అస్సలు వద్దంటూ నిర్మాతలతో తేల్చి చెప్పాడట.

ముందుగా విడుదల చేయడంకు షూటింగ్ ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. దాంతో సంక్రాంతికి సినిమా ను విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న రెండు పెద్ద సినిమాల విడుదల సంక్రాంతికే అవ్వడం నిజంగా విడ్డూరం అని చెప్పాలి.

ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే సారి విడుదల అయితే రెండు సినిమాలకు కూడా నష్టం ఉంటుంది. ఇప్పుడు ఆ రెండు సినిమాల నష్టం కూడా మైత్రి వారే భరించాల్సి ఉంటుంది. దాంతో మైత్రి వారు చాలా కష్టాల్లో పడ్డట్లు అయ్యిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. మైత్రి వారికి అమావాస్య భలే సమస్యలు తెచ్చి పెట్టింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News