నైజాం ఏరియాలో ఓ స్టార్ ప్రొడ్యూసర్ కింగ్. అతని వద్దే చాలా వరకు థియేటర్లు లీజులో వున్నాయి. అతన్ని కాదని మరొకరికి థియేటర్లని లీజుకి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా సదరు స్టార్ ప్రొడ్యూసర్, కమ్ నైజామ్ డిస్ట్రిబ్యూటర్ దే ఇక్కడ హవా. మధ్యలో ఎవరు పోటీకి వచ్చినా అతన్ని కాదని ఎగ్జిబిటర్లు థియేటర్లు ఇవ్వడం అనేది అంత సులువైన వ్యవహారం కాదు. దీంతో ప్రముఖ ప్రొడక్షన్ కంపనీలన్నీ సదరు స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కె తమ సినిమాలని ఇచ్చేస్తున్నాయి.
కానీ ప్రముఖ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం సదరు స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కు తమ సినిమాలని ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. గతంలో ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో సదరు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ నైజామ్ డిస్ట్రిబ్యూటర్ కు ధీటుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించింది. దీంతో ఈ ఇద్దరి మధ్య వార్ తెరవెనుక ఆల్ రెడీ మొదలైనట్టుగా తెలుస్తోంది.
కొత్తగా నైజామ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించిన మైత్రీ మూవీ మేకర్స్ కు అడ్డంకులు సృష్టించడం మొదలైందని తెలుస్తోంది. కారణం వచ్చే సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి చిరు నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', బాలయ్యతో చేస్తున్న 'వీర సింహారెడ్డి' రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.
వీటి కోసం థియేటర్లని సిద్ధం చేసే పనిలో మైత్రీ మూవీ మేకర్స్ వుండగా సదరు నైజాం డిస్ట్రిబ్యూటర్ కమ్ స్టార్ ప్రొడ్యూసర్ తన పరిధిలో వున్న థియేటర్లని బ్లాక్ చేయడం పనిగా పెట్టుకోవడం ఇప్పడు చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ నేపథ్యంలోనే కొంత మంది ఎగ్జిబిటర్లని సదరు నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీ మేకర్స్ కి థియేటర్లు కేటాయించరాదని, అలా చేస్తే తన సహకారం వుండదని బెదిరింపులకు దిగుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సంక్రాంతి బరిలో రెండు డబ్బింగ్ సినిమాలని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని స్టార్ ప్రొడ్యూసర్ కమ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తూ థియేటర్లని సిద్ధం చేయిస్తున్నారట.
ఇదే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలకు నైజాంలో థియేటర్స్ లేకుండా చేస్తోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై ఇండస్ట్రీలో ఎలాంటి చర్చ మొదలవుతుందో..వేచి చూడాల్సిందేనని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.