స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య మెల్లగా వేడి రాజేస్తోంది. విడుదలకు నెల రోజులు కూడా టైం లేదు. మే 4 ఎప్పుడో ఫిక్స్ చేసారు కాబట్టి ఇక ప్రమోషన్ మీద దృష్టి పెట్టింది యూనిట్. బన్నీ బర్త్ డే సందర్భంగా ఇందాకా డైలాగ్ ఇంపాక్ట్ పేరుతో చిన్న 40 సెకండ్ల టీజర్ ను విడుదల చేసారు. ఇందులో ధనాధన్ మంటూ బన్నీ పబ్బులో రౌడీ మూకను వాయిస్తూ ఉండగా తన్నులు తిన్నవాడు రేయ్ సౌత్ ఇండియాకా సాలా అంటే దానికి బన్నీ బదులుగా సౌత్ ఇండియా-నార్త్ ఇండియా-ఈస్ట్-వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మనకి ఉన్నది ఒక్కటే ఇండియా అంటూ తనదైన శైలిలో ఇంటెన్సిటీ టోన్ లో చెప్పడం సూపర్ గా కనెక్ట్ అయ్యింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ప్రతిది హీరో క్యారెక్టర్ ని ఎలేవేట్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చిన టీం ఇందులో కూడా అదే చేసింది.
అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే దీని ద్వారా మరింత స్పష్టత వచ్చినట్టే. ఆణువణువూ దేశభక్తి నింపుకున్న ఆవేశాన్ని అణుచుకోలేని ఒక ఆర్మీ ఆఫీసర్ కథే నా పేరు సూర్య. స్టార్ స్టొరీ రైటర్ వక్కంతం వంశీ డెబ్యు మూవీగా దీని మీద భారీ అంచనాలే ఉన్నాయి. డిజే తర్వాత గ్యాప్ తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో తన ఆహార్యాన్ని మార్చుకుని మరీ అల్లు అర్జున్ చేసిన ఈ మూవీ మీద ఫాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ నెలాఖరులోపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసే ప్లానింగ్ ప్రస్తుతం జరుగుతోంది. లగడపాటి శ్రీధర్-నాగబాబు-బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానియేల్ హీరొయిన్. గత ఏడాది లై లో కనిపించిన యాక్షన్ కింగ్ అర్జున్ ఇందులో బన్నీకి ఫాదర్ గా చాలా కీలకమైన పాత్రను పోషించినట్టు టాక్. టీజర్ లో విశాల్-శేఖర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ రేంజ్ లో హై లైట్ అయ్యింది
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View