ఫస్ట్ డే: 2వ స్థానంలో 'నా పేరు సూర్య'

Update: 2018-05-05 07:08 GMT
ఎన్నో అంచనాల మధ్యన నిన్ననే రిలీజైంది అల్లు అర్జున్ కొత్త సినిమా ''నా పేరు సూర్య''. అయితే ఈ సినిమాకు కాస్త తక్కువగా ప్రమోట్ చేయడం.. అలాగే మీడియాలోకూడా బన్నీ ఎక్కువగా కనిపించకపోవడంతో.. ఆ ప్రభావం సినిమా కలక్షన్లపై కనిపంచిందా అంటే అవుననే చెప్పాలి. అందులోనూ సినిమాకు మిక్సడ్ టాక్ రావడంతో.. ఇప్పుడు సూర్య కేవలం రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

దర్శకుడిగా మారిన రైటర్ వక్కంతం సూర్య డైరక్షన్లో రూపొందిన ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'' సినిమా తొలిరోజు వసూళ్ళను చూసుకుంటే.. మొత్తంగా 16.28+ కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ మొత్తం కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్ళు మాత్రమే. అయితే గతంలో రిలీజైన అల్లు అర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఏకంగా తొలిరోజున 17.9+ కోట్లు షేర్ వసూలు చేసింది. ఆ లెక్కన చూసుకుంటే.. ఇప్పుడు బన్నీ 2వ బెస్ట్ డే 1 వసూళ్ళను సాధించినట్లు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం మూడు వర్షన్లకు వచ్చిన కలక్షన్ చూసుకుంటే.. సినిమాకు 32 కోట్ల గ్రాస్ వచ్చిందని.. ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. అలా చూసుకుంటే.. ఇది డిజె కంటే ఎక్కువ వసూలే అని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లను పరిశీలిస్తే..

వైజాగ్.. 2.02 కోట్లు
ఈస్ట్.. 2.07 కోట్లు
వెస్ట్.. 1.54 కోట్లు
కృష్ణ.. 1.05 కోట్లు
గుంటూరు.. 2.47 కోట్లు
నెల్లూరు.. 0.63 కోట్లు
సీడెడ్.. 2.35 కోట్లు
నైజాం.. 4.15 కోట్లు
మొత్తంః 16.28 కోట్లు (తెలుగు రాష్ట్రాలలో షేర్) (23.8 కోట్ల గ్రాస్)
Tags:    

Similar News