స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి సినిమాకు ఏ స్థాయిలో కష్టపడతాడో అందరికి తెలిసిందే. కథలో బలం ఉంటె దానికి తగ్గట్టుగా తన నటనతో మరింత బలాన్ని ఇస్తాడు. అన్ని కోణాల్లోను సినిమా కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడు. డ్యాన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ లలో తన టాలెంట్ ను చూపిస్తూ సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. ప్రస్తుతం అదే తరహాలో నా పేరు సూర్య సినిమా కోసం కూడా బన్నీ కష్టపడుతున్నాడు.
ఎన్ని సినిమాలు బన్నీకి పోటీ వచ్చినా తప్పకుండా విజయం సాదిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. రీసెంట్ గా ఫస్ట్ ఇంపాక్ట్ తో అంచనాలను అందుకోగలదు అని సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే సినిమా రిలీజ్ డేట్ పై గత కొంత కాలంగా అనేక రూమర్స్ వస్తుండడంతో కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడింది. అసలైతే మొదట భరత్ అనే నేను సినిమాతో పాటే బన్నీ సినిమా కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాలి. కానీ రజినీకాంత్ 2.0 కూడా అదే సమయంలో సిగ్నల్ ఇవ్వడం కొంచెం కలవరపెట్టింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ లో తేడా రావచ్చు అనుకున్నారు. సూర్యా ముందే రావచ్చు అనే టాక్ కూడా వచ్చింది. కానీ ఫైనల్ గా వీళ్లు ఏప్రియల్ 27నే రావాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది.
నిన్నటి ప్రెస్ మీట్లో అసలు రిలీజ్ డేట్ గురించి చెప్పనేలేదు. కాని ట్రేడ్ సర్కిల్స్ వినిపిస్తున్న మాటేంటంటే.. ఏ సినిమా వచ్చినా రిలీజ్ డేట్ లో తేడా రాదని చెప్పారట. ఎలాగైనా సరే.. ఒకవేళ ఇటు రజనీ అటు మహేష్ వచ్చినా కూడా 27నే ఈ సూర్యను జనాల్లోకి దించుతాం అని క్లారిటీ ఇచ్చేశారట. మరి అంతగా మంకుపట్టు ఎందుకు పట్టేశారనేది ఇప్పుడు ఎవ్వరికీ అర్ధంకాని విషయం. ఏదేమైనా కూడా అల్లు అర్జున్ డెసిషన్ తో సమ్మర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో చాలా తేడాలు రావచ్చని అనిపిస్తోంది.