కలెక్షన్ రిపోర్ట్: రెండో రోజు సూర్య రేంజ్

Update: 2018-05-06 07:40 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య డివైడ్ టాక్ తో ఉన్నప్పటికీ వీక్ ఎండ్ కాబట్టి జోరు బాగానే ఉంది. రేంజ్ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటుతనం అవుతుంది కాబట్టి మొదటి వారం పూర్తయ్యాకే క్లారిటీ వస్తుంది. డిజేను పెద్ద మార్జిన్ తో దాటేస్తుంది అనే అంచనాలు మాత్రం నా పేరు సూర్య అందుకోలేదు. మొదటి రోజు భారీగా రాబట్టిన సూర్య రెండో రోజు మాత్రం కాస్త నెమ్మదించాడు. ఓవర్సీస్ లో దుమ్ము రేపుతాడు అనుకున్న ఫాన్స్  లెక్కలకు భిన్నంగా వసూళ్లు వస్తున్నాయి. రెండో రోజు 5 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టిన సూర్య ఆదివారం బాగానే రాబట్టే అవకాశాలు ఉన్నా అసలు పరీక్ష రేపటి నుంచి అంటే సోమవారం నుంచి మొదలావుతుంది. మొత్తంగా రెండు రోజులకు గాను సుమారు 43 కోట్ల గ్రాస్ తో 28 కోట్ల దాకా షేర్ రాబట్టిన బన్నీ కోరుకున్న దాని కన్నా ఇవి తక్కువ ఫిగర్స్. ఏరియా ల వారిగా చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి

నైజాం – 6 కోట్ల 25 లక్షలు

సీడెడ్ – 3 కోట్ల 40 లక్షలు

నెల్లూరు – 83 లక్షల 47 వేలు

గుంటూర్ – 2 కోట్ల 87 లక్షలు

కృష్ణా – 1 కోటి 43 లక్షల 60 వేలు

వెస్ట్ – 1 కోటి 77 లక్షలు

ఈస్ట్ – 2 కోట్ల 43 లక్షలు

ఉత్తరాంధ్ర – 2 కోట్ల 85 లక్షలు

యుఎస్ లో రెండు రోజులకు $530 డాలర్లు మాత్రమే వసూలు చేసిన నా పేరు సూర్య అక్కడ ఇప్పుడు బెంచ్ మార్క్ గా మారిన 3 మిలియన్ మార్క్ చేరుకోవడం కష్టమే అని ట్రేడ్ టాక్. కనీసం ఈ మూడు రోజుల్లో రెండు మిలియన్ మార్క్ దాటి ఉంటే ఆ టార్గెట్ పై ఆశలు పెట్టుకునే అవకాశం ఉండేది. కాని ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని తేలిపోయింది. రేపటి నుంది సక్సెస్ టూర్ ప్లానింగ్ లో ఉంది నా పేరు సూర్య టీం. వసూళ్లను బూస్ట్ అప్ చేయడానికి ప్రమోషన్ ను ఇలాగే మైంటైన్ చేసే విధంగా అన్ని సెట్ చేసుకున్నట్టు తెలిసింది.

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!
Tags:    

Similar News