`బాహుబలి` తరువాత తెలుగు సినిమా స్థాయి పెరిగింది.. మార్కెట్ కూడా పెరిగింది. దీంతో ఏ స్టార్ హీరోని కదిలించినా ఒకటే మాట పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. ప్రస్తుతం మన హీరోల్లో అత్యధిక శాతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా వున్నారు. టాలీవుడ్ కు ఈ స్థాయి గౌరవాన్ని తీసుకొచ్చి పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్` ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
ఈ మూవీతో పాటు ప్రభాస్ సలార్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే `ఆదిపురుష్` చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ వంగతో చేయనున్న `స్పిరిట్` త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఇక నాగ్ అశ్విన్ తో చేస్తున్న `ప్రాజెక్ట్ కె` సెట్స్ పై వుంది. పాన్ ఇండియా స్థాయికి మించి ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరపైకి తీసుకురానున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక అతిథి పాత్రలో నటిస్తుండగా క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది.
`ఆదిత్య 369` తరహాలో టైమ్ ట్రావెలింగ్ కథతో హిమాలయాల నేపథ్యంలో సాగనున్న ఈ మూవీని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ లపై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఆటోమోబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. `ప్రియమైన ఆనంద్ మహీంద్రా సర్ .. భారతీయ భాషల్లో సైన్స్ ఫిక్షన్ `ప్రాజెక్ట్ కె` అత్యంత భారీ బడ్జెట్ తో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికలతో చేస్తున్నాం.
ఈ ప్రాజెక్ట్ కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. దీని కోసం ప్రత్యేకంగా భారీ వాహనాలని తయారు చేయిస్తున్నాం. అవి నేటి సాంకేతికతకు మించి చాలా ప్రత్యేకతలతో కూడి వుంటాయి. ఈ మూవీ అద్భుతంగా కుదిరితే అది మన దేశానికే గర్వకారణంగా భావించాలి. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను సర్. మాలో ప్రతిభావంతులైన వ్యక్తులు, ఇంజినీర్లు, అత్యుత్తమ డిజైనర్ లు వున్నారు. అయితే ప్రాజెక్ట చాలా బిగ్ స్కేల్ లో రూపొందుతోంది. దీనికి మీ సహకారం కావాలి. ఈ తరహా సినిమాని ఇంతకు ముందెన్నడూ ఎవరూ ప్రయత్నించలేదు.
భవిష్యత్తుకు సంబంధించిన కొత్త ప్రపంచాన్ని రూపొందించడంలో మాకు మీ సహకారం అవసరం. అది మీరు చేయగలిగితే గౌరవంగా వుంటుంది` అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ ఆనంద్ మహీంద్రాకు రిక్వెస్ట్ చేశారు. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందనైతే ఇప్పటి వరకు రాలేదు. నాగ్ అశ్విన్ ట్వీట్ పై ఆనంద్ మహీంద్రా ఎలా స్పందిస్తాడో చూడాలి అని చాలా మంది నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన స్పందిస్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చజరుగుతోంది.