గంగిగోవు పాలు గరిటడైనా చాలు.. కడవనైనా ఏమి కరము పాలు అని ఒక సామెత. ఏ ప్రత్యేకతా లేకుండా ఏదో సినిమా తీశామంటే తీశామన్నట్లుగా పదుల సంఖ్యలో సినిమాలు తీసినా ప్రయోజనం ఏముంది? తీసినవి తక్కువ సినిమాలైనా సరే.. వాటితో బలమైన ముద్ర వేయాలి. మున్ముందు ఎలాంటి సినిమాలు తీస్తాడో.. ఏ స్థాయికి చేరతాడో కానీ.. ‘మహానటి’ సినిమాతో మాత్రం శిఖర స్థాయిని అందుకున్నాడు నాగ్ అశ్విన్. కేవలం ఒక్క సినిమా అనుభవంతో అతను ‘మహానటి’ లాంటి అద్భుత చిత్రాన్ని తీర్చిదిద్ది తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. కేవలం సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో దిగ్గజాలుగా పేరున్న వాళ్లు సైతం ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. సొసైటీలో అన్ని రకాల వ్యక్తులూ ఈ సినిమాకు సలాం కొడుతున్నారు. సినిమాలంటే పడని మేధావి వర్గం సైతం ‘మహానటి’ని వేనోళ్ల పొగుడుతున్నారు. సినిమాలు చూడ్డం మానేసిన నిన్నటితరం ప్రేక్షకుల్ని సైతం ‘మహానటి’ థియేటర్లకు రప్పిస్తోంది.
గత కొన్నేళ్లలో తెలుగు సినిమా మారుతున్న.. ఎదుగుతున్న తీరు చూసి వేరే ఇండస్ట్రీల వాళ్లు నివ్వెరపోతున్నారు. ఈ క్రమంలో అందరినీ మరోసారి మన ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది ‘మహానటి’. ఈ చిత్ర తమిళ వెర్షన్ శుక్రవారం విడుదలైంది. అక్కడ కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ఇంతకుముందు సౌత్ ఇండియాలో తమిళ సినిమాది ఆధిపత్యంగా ఉండేది. దాంతో పోల్చి తెలుగు సినిమాను తక్కువ చేసి మాట్లాడేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. ఇప్పుడు ‘మహానటి’ని ఇంత గొప్పగా తీయడం చూసి వాళ్లు షాకవుతున్న పరిస్థితి. నాగ్ అశ్విన్ అనేవాడి పేరు అక్కడా మార్మోగుతోంది. ఎవరీ దర్శకుడు అని అతడి బ్యాగ్రౌండ్ ఆరా తీస్తున్నారు. ఇక తెలుగు జనాల సంగతి చెప్పాల్సిన పని లేదు. తెలుగులో మేటి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ అంతటి వాడు.. అశ్విన్‌ను అభినందిస్తూ ఎలాంటి లేఖ రాశాడో తెలిసిందే. ఓ పెద్దావిడ తనను అశ్విన్ అనుకుని పొగడ్డంతో తాను ఎలాంటి అనుభూతికి లోనయ్యానో సుకుమార్ తనదైన స్టయిల్లో చెబుతూ అశ్విన్‌ను శిఖరాన కూర్చోబెట్టేశాడు. అల్లా టప్పా సినిమాలతోనే ఒక హిట్టు కొడితేనే విర్రవీగే దర్శకులున్న ఈ రోజుల్లో ఇంత గొప్ప సినిమా తీసి.. ఎప్పుడూ ఏ హడావుడీ చేయకుండా.. విడుదల తర్వాత ఇన్ని ప్రశంసల్లో తడిసి ముద్దవుతూ కూడా తన సింప్లిసిటీని చాటుకుంటున్న అశ్విన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.