కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న సంక్రాంతి కానుకగా థియచేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. జీ స్టూడియోస్ తో కలిసి కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు. 2016లో సంక్రాంతి బరిలో నిలిచి సందడి చేసిన `సోగ్గాడే చిన్నినాయనా` చిత్రానికిది ప్రీక్వెల్. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నాగ్ కెరీర్ లోనే వంద కోట్ల మైలు రాయిని దాటిన మూవీ కావడంతో దీనికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న`బంగార్రాజు` చిత్రంపై నాగార్జున భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించిన చిత్ర బృందం ప్రచార పర్వాన్ని స్పీడప్ చేసేసింది. తాజాగా ఈమూవీ మ్యూజికల్ నైట్ ని ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నాగాచైతన్య, నాగార్జున, హీరోయిన్ కృతిశెట్టి, డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో నాగచైతన్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహాలో `మనం` కోసం సెలబ్రేట్ చేసుకున్నామని గుర్తు చేసుకున్నారు. ప్రతీ సినిమాకు ఆడియో చాలా ముఖ్యమని ఒక్క సాంగ్ వైరల్ అయితే సినిమా ఆలోమెటిక్ గా వైరల్ అవుతుందన్నాడు. అయితే `బంగార్రాజు` విషయంలో మాత్రం ఆల్ సాంగ్స్ వైరల్ అయ్యాయని, ప్రతీ ఒక్కరూ ఇది ఫెస్టవల్ మూవీ అని చెబుతున్నారని గుర్తు చేశారు.
పండగ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వారందరికీ `బంగార్రాజు` పండగ సెలబ్రేషన్ ని అందిస్తుందని, ఈ సందర్భంగా నాకు బంగారం లాంటి క్యారెక్టర్ ని ఇచ్చిన దర్శకుడు కల్యాణ్ కృష్ణకి, నాన్నకి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు నాగచైతన్య. ఇదే సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి వెల్లడించిన నాగ్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
అంతే కాకుండా జనవరి 14 అన్నపూర్ణ బ్యానర్ కు ఎంత ఇంపార్టెంట్ అన్నది క్లారిటీ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియో ప్రారంభించింది ఇదే రోజని, 50 ఏళ్ల క్రితం నాన్న అక్కినేని నాగేశ్వరరావు నటించిన `దసరా బల్లోడు` మూవీ సరిగ్గా ఇదే రోజు సంక్రాంతికి విడుదలైందని, మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని అందులోని ప్రతీ పాట ఓ డైమండ్ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఈవెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇదే స్టేజ్ పైకర్రపట్టుకుని సందడి చేస్తే కృతిశెట్టి చేతి గాజులతో సవ్వడి చేయడం.