యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్నారు. అటు కెరీర్ పరంగా ఇటు పర్సనల్ లైఫ్ విషయంలోనూ చైతూ వార్తల్లో నిలిచారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'లవ్ స్టోరీ' సినిమాతో మ్యాజికల్ బ్లాక్ బస్టర్ అందుకొని టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి పోసాడు. అదే సమయంలో తన సతీమణి సమంత తో విడిపోతున్నట్లు ప్రకటించి, నాలుగేళ్ల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికాడు.
శనివారం సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు చైతన్య ప్రకటించారు. భార్యాభర్తల బంధానికి దూరంగా ఉండాలనుకుంటున్నామని.. చాలా చర్చలు జరిపి ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సామ్ తో తమ విడాకుల గురించి చివరగా ట్వీట్ చేసిన నాగచైతన్య.. ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ట్విట్టర్ లో స్పందించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయి తేజ్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తను కోలుకుంటున్నట్టు థంబ్ సింబల్ తో ఓ ట్వీట్ చేసి అభిమానులకి ఊరటనిచ్చారు. దీనిపై సినీ ప్రముఖులు శ్రేయోభిలాషులు స్పందిస్తుండగా.. నాగచైతన్య కూడా ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ''తేజ్.. ఇది చూసినందుకు చాలా సంతోషంగా ఉంది!! బోలెడంత ప్రేమ'' అని చైతూ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చై వ్యక్తిగత విషయాల గురించి మెన్షన్ చేస్తూ స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నారు.