సమంత-చైతన్య 'మజిలి' ఏ తీరాలకు..?

Update: 2018-08-16 07:09 GMT
‘ఏమాయ చేసావో’ సినిమాలో కలిసి నటించిన జంట సమంత-నాగచైతన్య. ఆ సినిమాలో ప్రేమికులుగా ఒదిగిపోయారు. ఆ సినిమా ఎఫెక్టో ఏమో కానీ.. ఆ తరువాత నిజమైన ప్రేమికులుగా మారారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. రియల్ లైఫ్ కపుల్ గా మారారు. చాలా సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్ పెయిర్.. పెళ్లి అయిన తర్వాత మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇప్పుడా కల సాకారం కాబోతోంది.

‘నిన్ను కోరి’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని తీసిన దర్శకుడు శివ నిర్వాణ ఇప్పుడు నాగచైతన్య-సమంతలను మళ్లీ జోడీ కట్టించబోతున్నాడు. వీరిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఓ మంచి కథను తయారు చేశాడట... రోమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ‘మజిలి’ అనే టైటిల్ ను పెట్టినట్టు తాజాగా వార్తలొచ్చాయి.

 ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట.. ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో రియల్ భార్యభర్తలు సమంత-చైతన్య ఎలా నటిస్తారోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Tags:    

Similar News