కొత్త జంట కోసం ప్రేమ కుటీరం

Update: 2017-12-16 04:27 GMT
టాలీవుడ్ లోనే కాదు. మొత్తం సౌత్ లోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న జంట నాగచైతన్య-సమంత. ఎన్నాళ్లగానే ఉన్న ప్రేమబంధాన్ని పెళ్లితో బంధంగా మార్చుకుని కొత్త కాపురం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్లిద్దరికో గిఫ్ట్ ఇవ్వడానికి నాగచైతన్య తండ్రి నాగార్జున రెడీ అవుతున్నారు. అదేమిటంటే వీరిద్దరి కోసం ఓ అందమైన ప్రేమకుటీరం నిర్మించిన ఇవ్వబోతున్నారు.

అక్కినేని వారి సొంతమైన అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జునకు ఓ కాటేజ్ ఉంది. ఇప్పుడు ఆ కాటేజికి ఆపోజిట్ లో ఓ కొత్త కాటేజీ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ కాటేజీ నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టి ఫైనల్ స్టేజీకి తీసుకొచ్చారు. ఇతర కాటేజీలకు భిన్నంగా దీనిని ఓ డిఫరెంట్ లుక్ లో తీర్చిదిద్దుతున్నారు. చూడగానే పాతకాలం నాటి భవనం అనిపించేలా ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఇంతవరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో కేవలం నాగార్జున మాత్రమే కాటేజి ఉంది. ఇదో రకంగా నాగ్ కు స్పెషల్ అన్నమాట. ఇప్పుడు అంతకన్నా స్పెషల్ గా ఉండేలా కొత్త కాటేజీని డిజైన్ చేయిస్తున్నారు. నాగచైతన్య- సమంతల్లో ఇకపై ఎవరకు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ కోసం వచ్చినా వాళ్లు రెస్టు తీసుకోవడానికి కుటీరం సిద్ధంగా ఉంటుందన్న మాట.

పెళ్లయిన తర్వాత కొద్దికాలం పాటు సినిమాలకు గ్యాపిచ్చిన నాగచైతన్య అండ్ సమంత ప్రస్తుతం షూటింగుల్లో బిజీ అయిపోయారు. చైతన్య ప్రేమమ్ ఫేం డైరెక్టర్ చందు మొండేటితో సవ్యసాచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. సమంతయేమో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం-1985 సినిమా కంప్లీట్ చేసే పనిలో పడింది.


Tags:    

Similar News