రానా దోస్తుల షో మొదలైంది

Update: 2017-06-17 11:09 GMT
మన తెలుగులో ఇప్పుడు హోస్ట్ షో లకు మంచి గిరాకీ ఏర్పడింది. సూపర్ స్టార్స్ గురించి తెలుసుకోవడం ఒక సూపర్ స్టార్ హోస్ట్ చేయడం చూసే వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ముందు నాగార్జున ఆ వెంటనే చిరంజీవి ఇప్పుడు ఎన్టీఆర్.. ఇక రానా హోస్ట్ లాగా షోలు చేస్తున్నారు. ఇక రానా చేస్తున్న ‘నెంబర్ 1 యారి విత్ రానా’ అనే టాక్ షో షూటింగ్ మొదలైంది.

స్టార్స్ స్నేహాలు, వాళ్ళ సరదాలు, వ్యక్తిగత విషయాలు మాటలాడుకునే టాక్ షో నెంబర్ వన్ యారి విత్ రానా  జెమిని టి‌వి లో ప్రసారం కాబోతుంది. ఈ షో షూటింగ్ కూడా మొదలుపెట్టారు. తొలిసారి ఈ షోకు తన అంకుల్ మరియు బావ కలిసి వచ్చారు. సీనియర్ హీరో సుమంత్ రానాకి వరుసకి అంకుల్ అవుతాడట. ఇక రానా కి నాగ చైతన్య బావ కన్నా మంచి మిత్రుడు అని అందరూ చెబుతుంటారు. కలిసి పెరిగిన వాళ్ళు ఒకే దగ్గర పని చేసే వాళ్ళు కాబట్టి వీళ్ళు చాలా విషయాలు మాటలాడుకునేటట్లు ఉంది. చూద్దాం చూసే వాళ్ళకి ఎంతటి ఆనందాన్ని పంచుతారో. ఆ తరువాత మనోడు ఈషోకు మాంచి స్నేహితులైన అఖిల్ అండ్ కార్తికేయ (రాజమౌళి కొడుకు)లను ఆహ్వానించాడు. వారు కూడా అప్పుడే షూటింగులో పాల్గొన్నారంతే.

హింది లో ఇటువంటి షోలు చాలానే వచ్చాయి. మన తెలుగులో టాక్ షో లు చాలా తక్కువ అనే చెప్పాలి. ఉన్న కూడా అవి ఒక జర్నలిస్టు ఇంటర్వ్యూ లా అనిపిస్తుంది కానీ ఒక స్టార్ లో ఉన్న మామూలు మనిషిని చెప్పే ప్రయత్నం చేయలేదు. మరి ఈ షో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News