చైలో కొత్త 'అవతార్‌' చూస్తారు

Update: 2015-07-22 05:54 GMT
దోచెయ్‌ తర్వాత నాగచైతన్య సైలెంటైపోయాడేంటి? అనుకుంటున్నారా? .. అస్సలు సైలెంట్‌ కాలేదు. సైలెంటుగా తన పని తాను చేసుకుపోతున్నాడంతే. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఓ స్టయిలిష్‌ యాక్షన్‌ లవ్‌ స్టోరిలో నటిస్తున్నాడు. సగం షూటింగ్‌ పూర్తయ్యింది. ఇంకా సగం చిత్రీకరించాల్సి ఉంది. అయితే ఆన్‌ సెట్స్‌ ఏం జరుగుతోంది? అన్న విషయాన్ని కోన లైవ్‌ గా చెప్పాడిలా.

చెయ్‌ ను ఈసారి కొత్త అవతారంలో చూస్తారు. ఇంతవరకూ చూడని సరికొత్త అవతారమిది. గౌతమ్‌ ఓ స్టయిలిష్‌ యాక్షన్‌ లవ్‌ స్టోరిని అంతే స్టయిలిష్‌గా తెరకెక్కిస్తున్నాడు. హృదయం, ఆత్మని లీనం చేసి మరీ పనిచేస్తున్నాడు గౌతమ్‌. మేం కూడా ఈ సినిమా కోసం పట్టుదలగా శ్రమిస్తున్నాం. మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. దీంతో 50శాతం షూటింగ్‌ పూర్తయినట్టేనని చెప్పాడు. అలాగే ఏ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు. పాటలు సూపర్‌హిట్‌ అవ్వడం ఖాయం అని చెప్పాడు.

ఏమాయ చేశావె చిత్రంతో చైతూని సక్సెస్‌ ఫుల్‌ హీరోని చేశాడు. ఇప్పుడు ఈ స్టయిలిష్‌ ఎంటర్‌ టైనర్‌తో మరో మెట్టు ఎక్కించడానికి గౌతమ్‌ సిద్ధమవుతున్నాడన్నమాట! యాక్షన్‌, స్టయిల్‌ కలగలిపిన రొమాంటిక్‌ లవ్‌ స్టోరీలు తీయడంలో గౌతమ్‌ ని కొట్టేవాడే లేడు. ఈ సినిమా కచ్ఛితంగా క్లాసిక్‌ అవుతుందనడంలో సందేహమే లేదు.
Tags:    

Similar News