ఇంకా సినిమా పూర్తి కాలేదు. రిలీజ్ కు ఇంకా మూడు నెలల దాకా టైం ఉన్నట్లుంది. కానీ అప్పుడే బిజినెస్ అయిపోయింది ఓ సినిమాకు. ఆ చిత్రం మరేదో కాదు.. ‘ప్రేమమ్’ రీమేక్ ‘మజ్ను’. ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్ లాంటి టాప్ హీరోయిన్ తో పాటు ఇంకో ఇద్దరు హీరోయిన్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ కావడం.. ‘మజ్ను’ అనే పేరు పెట్టడం.. నాగచైతన్యకు లవ్ స్టోరీస్ బాగా అచ్చిరావడం.. కార్తికేయ మూవీతో చందూ మొండేటి ప్రామిసింగ్ డెబ్యూ చేయడం.. ఇవన్నీ ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి.
దీంతో సినిమా సగం పూర్తయ్యే టైంకే బిజినెస్ పూర్తి చేశాడట నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి రూ.22 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు సమాచారం. సినిమాకు రూ.16-17 కోట్ల దాకా ఖర్చయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఒక్క కృష్ణా జిల్లా మినహా అన్ని ఏరియాలకూ బిజినెస్ పూర్తి చేశారట. ఈ ఒక్క జిల్లాను మినహాయించాక, శాటిలైట్ కూడా కలిపి రూ.22 కోట్ల బిజినెస్ జరిగిందట. అంటే సినిమా సగంలో ఉండగానే నిర్మాత ఐదారు కోట్ల లాభంతో ఉన్నాడు. పైగా ఒక ఏరియా రైట్స్ కూడా చేతిలోనే ఉన్నాయి. ఒక వ్యక్తి లవ్ లైఫ్ లోని మూడు దశల్ని చూపించే కథతో తెరకెక్కిన ‘ప్రేమమ్’ మలయాళ ప్రేక్షకుల్ని మైమరిచిపోయేలా చేసింది. తెలుగు, తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగానే చూశారు. మరి తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి.