చైతన్య పెళ్ళి కోసం సెట్టేస్తున్నారోచ్

Update: 2017-02-28 18:58 GMT
ఒక ప్రక్కన అక్కినేని వారింట జరగాల్సిన రెండు పెళ్లిళ్ళలో ఒక పెళ్ళి ఆగిపోయింది. ఈ సమయంలో పెద్దోడు నాగ చైతన్య పెళ్ళి కోసం భారీ హంగామా చేయబోతున్నారంటే.. అది పెద్ద విషయమే. ఓల్డెన్ ఓల్డెన్. ఇక్కడ మ్యాటర్ అది కాదు. వేరే ఉంది.

ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తీసిన కళ్యాణ్‌ కృష్ణ డైరక్షన్లో చైతూ ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ అండ్ లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక అదిరిపోయే పెళ్ళి సీన్ ఉందట. అందుకోసం ఇప్పుడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద సెట్ వేస్తున్నారు. ఆ పెద్ద సెట్లో మరి చైతన్య.. రకుల్ ను పెళ్ళిచేసుకుంటాడో లేకపోతే లావణ్యను పెళ్ళి చేసుకంటాడో తెలియదు కాని.. పెళ్ళి మాత్రం పక్కా అంటున్నారు యునిట్ సభ్యులు.

మొత్తానికి రియల్ లైఫ్‌ లో పెళ్ళికి సమయం దగ్గర పడటం.. అదే సమయంలో తనకు వెండితెరపై కూడా ఇలా పెళ్ళిళ్ళు అయిపోవడం.. అదో కోయిన్సిడెన్స్ అంతే. ఇంతకీ ఈ సెట్టింగుల్లో పెళ్ళి సంగతి సరే.. అసలు సమంతతో మ్యారేజ్ ఎప్పుడు చెయ్? టెల్ ది డేట్ యార్!!
Tags:    

Similar News