#ChaiSam పిల్లాడు పెళ్ళికొడుకు అయ్యాడు

Update: 2017-10-06 05:39 GMT
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులు అయ్యి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంతో ఆనందపడతారు. ఇప్పుడు కింగ్ నాగార్జున్ కూడా అంతే. ఒక ప్రక్కన హీరోగా తన కెరియర్ ను పదిలం చేసుకున్న నాగచైతన్య.. ఇప్పుడు పెళ్లిచేసుకుంటున్నాడు. ఇంట్లో పెద్దలందరినీ ఒప్పించి తను ప్రేమించిన హీరోయిన్ సమంత మెడలో ఈరోజు రాత్రికి మూడు ముళ్ళూ వేయనున్నాడు.

ఆ సందర్భంగా హిందూ సాంప్రదాయం ప్రకారం మనోడిని ఈరోజు ఉదయం పెళ్ళికొడుకును చేశారు. ఈ కార్యక్రమంలో ఇటు ప్రక్కన తండ్రి నాగార్జున అటు మావయ్య వెంకటేష్‌ దగ్గుబాటి కూడా ఉన్నారు. ఇద్దరూ కలసి తమ వారసుడితో దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు నాగార్జున. మావాడు పెళ్ళికొడుకు అయ్యాడు అంటూ స్వయంగా అప్డేట్ ఇచ్చారు. చూస్తుంటే సమంత ఈ పెళ్ళికి వచ్చిన గెస్టులను ఫోటోలను షేర్ చేయవద్దని చెప్పినా కూడా.. నాగార్జున మాత్రం పిఆర్వో జాబ్ టేకప్ చేసినట్లున్నారే అంటున్నారు నెటిజిన్లు.


Tags:    

Similar News