‘ప్రేమమ్’ సినిమా రీమేక్ అయినా అలాంటి భావన కలగకుండా ఓ స్ట్రెయిట్ మూవీ అన్న ఫీలింగ్ ఇస్తోందంటే అందుకు పూర్తిగా దర్శకుడు చందూ మొండేటికే క్రెడిట్ ఇవ్వాలని అన్నాడు అక్కినేని నాగచైతన్య. ‘ప్రేమమ్’ విషయంలో చందూ చూపించిన సిన్సియారిటీ.. అతడి కష్టం తనకు బాగా తెలుసని.. అందుకే ఇప్పుడీ సినిమాకు ఇంత మంచి ఫలితం వచ్చిందని చైతూ అన్నాడు.
‘‘ప్రేమమ్ సినిమా రీమేక్ చేద్దామని నిర్మాత వంశీ గారే నన్ను అప్రోచ్ అయ్యారు. అప్పటికి చందు తన సొంత కథతో నాతో సినిమా చేయాలనుకున్నాడు. ప్రేమమ్ చేద్దామన్న నా రిక్వెస్ట్ మీదే ఒప్పుకున్నాడు. ఐతే మలయాళ వెర్షన్ కంటే గొప్పగా ఏదో చేద్దామని.. చాలా మార్పులు చేసేయాలని ఏమీ అనుకోలేదు. నిజాయితీగా ఓ ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. ఐతే ‘ప్రేమమ్’ చూసిన వారం రోజులకు చందూ ఆ సినిమా సంగతి మరిచిపోయాడు.
అందులోని మూల కథను.. తీసుకుని సొంతంగా స్క్రిప్టు రాసుకుంటూ వెళ్లాడు. రెండు నెలలు చాలా కష్టపడి స్క్రిప్టు తయారు చేసుకుని వచ్చాడు. మన ప్రేక్షకుల సెన్సిబిలిటీస్ కు తగ్గట్లుగా అతను చక్కటి మార్పులు చేశాడు. స్క్రిప్ట్ అంతా రీరైట్ చేశాడు. సినిమా అంతటా అతడి ముద్ర కనిపిస్తుంది. ‘ప్రేమమ్’ ఒక స్ట్రెయిట్ మూవీలా కనిపిస్తుందంటే అది అతడి క్రెడిటే. సినిమా కోసం చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడతను’’ అని చైతూ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/