అక్కినేని నాగచైతన్య ఇటీవలే తన భార్య సమంత తో వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మామూలుగానే సోషల్ మీడియాకు దూరంగా ఉండే చైతూ.. అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో కనిపించలేదు. ట్విట్టర్ లో అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. అయితే సామ్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన 45 రోజుల తర్వాత శనివారం ఇన్స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు చై.
అమెరికన్ హాలీవుడ్ నటుడు మాథ్యూ మెకన్ హే రచించిన ‘గ్రీన్ లైట్స్’ అనే ఆటోబయోగ్రఫీ చదివిన నాగచైతన్య.. ‘‘జీవితానికి ప్రేమ లేఖ.. గ్రీన్ లైట్స్’’ అని ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. మాథ్యూని ట్యాగ్ చేస్తూ.. 'మీ ఆత్మకథని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. జీవితంలో ముందుకు వెళ్లేందుకు నాకు ఈ పుస్తకం ఉపయోగపడింది. ఇలాంటి పుస్తకం రచించినందుకు మీకు గౌరవవందనాలు సార్' అని చై పోస్ట్ చేసారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండే చైతన్య.. తన సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ - స్పోర్ట్స్ కార్లు - బైక్ రైడింగ్ ఫోటోలని మాత్రమే షేర్ చేస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను పబ్లిక్ తో పంచుకోడానికి పెద్దగా ఇష్టపడరు. గతంలో సమంత సైతం పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే విడాకుల ప్రకటన తర్వాత తొలిసారి జీవితానికి సంబంధించిన పుస్తకం గురించి సోషల్ మీడియాలో చర్చించడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా నాగచైతన్య తన లైఫ్ లో జరిగిన విషయాలు కెరీర్ మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఇటీవలే 'లవ్ స్టొరీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చైతూ.. ప్రస్తుతం తన తండ్రి అక్కినేని నాగార్జున తో కలిసి 'బంగార్రాజు' సినిమా చేస్తున్నాడు. అలానే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదే క్రమంలో చై త్వరలో ఓటీటీల్లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రూపొందించే ఈ సిరీస్ లో చైతన్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.