ప్రేమకథలకి అంతముందేమో కానీ.. ఫీలింగ్స్ కి మాత్రం అంతం లేదంటున్నాడు నాగచైతన్య. ప్రేమలో ఉన్నప్పటి అనుభూతులు ఎప్పటికీ మనతోనే ఉంటాయని అంటున్నాడు. ఆయన చెబుతున్న ప్రేమమ్ సంగతులు ఇవి. నాగచైతన్య కథానాయకుడిగా ప్రేమమ్ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళంలో విజయవంతమైన చిత్రం ప్రేమమ్. ఆ చిత్రాన్ని తెలుగులో చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు. మొదట ఈ సినిమాకి మజ్ను అనే పేరు ప్రచారంలోకి వచ్చింది.
కానీ నాగచైతన్య మాత్రం మార్పును ఇష్టపడలేదు. మలయాళంలోని పేరునే కంటిన్యూ చేసేశాడు. శుక్రవారమే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఆ డిజైన్ అదుర్స్ అనేలా ఉంది. దర్శకుడి తాలూకు భావుకత - కథ తాలూకు ఎఫెక్ట్ ఆ పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన శ్రుతిహాసన్ - అనుపమ పరమేశ్వరన్ - మడోన్నా సెబాస్టియన్ నటించారు. వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.