జయాపజయాలతో సంబంధం లేకుండా అక్కినేని హీరోలు స్పీడ్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు చేస్తూ జోరు పెంచుతున్నారే కానీ, ఎక్కడా తగ్గలేదు. అక్కినేని కాంపౌండ్ హీరోలు, నాయికలు అంతా బిజీ బిజీ. ప్రస్తుతం కింగ్ నాగార్జున ఓ మూడు సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇవన్నీ సీక్వెల్ సినిమాలే కావడం ఆసక్తికరం. మన్మధుడు 2, బంగార్రాజు (సోగ్గాడే చిన్ని నాయన 2), రాజు గారి గది 3 చిత్రాల్లో నటించనున్నారు. అయితే వీటిలో ఏ సినిమా ముందు ప్రారంభమవుతోంది? అంటే తాజాగా ఓ సమాచారం అందింది.
రాహుల్ రవీంద్రన్ `మన్మధుడు 2` చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరోవైపు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజును పట్టాలెక్కించేందుకు తొందర పడుతున్నారట. జూన్ లో ఈ సినిమా మొదలవుతుందని చెబుతున్నారు. మరోవైపు ఓంకార్ `రాజుగారి గది 3` చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున నటించే సినిమాలపై అక్కినేని అభిమానుల్లో ఒకటే ఉత్కంట నెలకొంది. బాలీవుడ్ తరహాలో సీక్వెల్ సినిమాల ట్రెండ్ మనకు కూడా జోరుగా ఉందన్న చర్చా సాగుతోంది. తొలి భాగం హిట్లు కొట్టిన దర్శకులకు మలి ఛాన్స్ ఇస్తూ నాగార్జున ప్రోత్సహించడంపైనా ఆసక్తికర ముచ్చటా సాగుతోంది.
ఇదంతా అటుంచితే నాగార్జున `బంగార్రాజు`లో చైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. చైతూ ఏ పాత్రలో నటిస్తాడు? అంటే.. బంగార్రాజుకు మనవడి పాత్రలో ఎంట్రీ ఇస్తాడట. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో బంగార్రాజుగా, ఆయన కొడుకుగానూ నాగార్జున నటించారు. కానీ తాజా ప్రీక్వెల్ మూవీలో చైతన్య ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మనవడు పాత్ర అంటే తాత లక్షణాలు పుణికి పుచ్చుకున్న రసిక రాజాగా కనిపిస్తాడా? అన్న క్యూరియాసిటీ అక్కినేని అభిమానుల్లో కనిపించనుంది. ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్యకృష్ణ కథానాయికగా నటించనుంది. చైతన్య సరసన ఎవరిని ఎంపిక చేశారు? అన్నది తేలాల్సి ఉంది.