వినాయక చవితికి కానుకగా విడుదలైన అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’కు టాక్ ఏమంత గొప్పగా లేదు. ఏమాత్రం కొత్తదనం లేని కథతో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇటు విమర్శకులు.. అటు ప్రేక్షకులు పెదవి విరిచారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టింది. వినాయక చవితి సెలవు రోజు రిలీజ్ కావడం కలిసొచ్చిందని అనుకున్నప్పటికీ తొలి రోజు నాగచైతన్య సినిమాకు రూ.7 కోట్ల దాకా షేర్.. రూ.12 కోట్ల దాకా గ్రాస్ రావడం అన్నది అనూహ్యమైన విషయం. అతడి మార్కెట్ ఆ స్థాయిలో లేదు. ఇంతకుముందు హిట్ టాక్ తెచ్చుకున్న చైతూ సినిమాలకు కూడా రూ.10 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. అలాంటిది నెగెటివ్ టాక్ తో మొదలైన చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు రావడం అనూహ్యమే.
విశేషం ఏంటంటే ‘శైలజారెడ్డి అల్లుడు’ వసూళ్లు రెండో రోజు కూడా నిలకడగానే ఉన్నాయి. శుక్రవారం కూడా ఈ చిత్రానికి మంచి షేరే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వీకెండ్ అంతా ఈ సినిమా జోరు కొనసాగేలా కనిపిస్తోంది. చైతూ నుంచి చివరగా వచ్చిన ‘యుద్ధం శరణం’ మాత్రం దీనికి భిన్నమైన ఫలితాన్నందుకుంది. ఆ చిత్రానికి కూడా పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. దానికి ఓపెనింగ్స్ కనీస స్థాయిలో కూడా రాలేదు. తొలి రోజు షేర్ రూ.2 కోట్ల లోపే కావడం గమనార్హం. దాంతో పోలిస్తే టాక్ కొంచెం పర్వాలేదు కానీ.. అయినప్పటికీ ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రానికి తొలి రోజు రూ.7 కోట్ల షేర్ రావడం అనూహ్యం. దీన్ని బట్టి నాగచైతన్యకు ఎలాంటి సినిమాలు సూటవుతాయి.. అతను ఏవి చేస్తే మంచి ఫలితం ఉంటుంది అన్నది అర్థం చేసుకోవచ్చు. చైతూ ఎప్పుడు యాక్షన్ సినిమా చేసినా చేదు అనుభవమే ఎదురవుతోంది. ‘దడ’.. ‘బెజవాడ’.. ‘దోచేయ్’.. ఇలా యాక్షన్ సినిమా చేసిన ప్రతిసారీ అతడికి దారుణమైన ఫలితమే వచ్చింది. లవ్ స్టోరీలు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేస్తే మాత్రం టాక్ ఎలా ఉన్నప్పటికీ ఫలితం బాగానే ఉంటోంది.