నాగచైతన్య కెరీర్ పీక్స్ లో ఉందిప్పుడు. రకరకాల ప్రయోగాలు చేస్తూనే కమర్షియల్ హిట్లు కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నటించాడు. ఆ వెంటనే ప్రేమమ్ రీమేక్ లో నటించేస్తూ హాట్ టాపిక్ అయ్యాడు. ఈ సినిమా ఎక్స్ పెరిమెంటల్ - సేమ్ టైమ్ కమర్షియల్ స్టఫ్ ఉన్న సినిమా. అందుకే పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిపోయి నటిస్తున్నాడు. ఈ మూవీ కథాంశం ప్రకారం మూడు దశల్లో మూడు రూపాలతో కనిపిస్తాడు చైతూ అందులో ఒకటి టీనేజీ - రెండోది మిడిలేజీ - ఇంకోటి కాలేజ్ స్టూడెంట్ లైఫ్.. ఈ మూడింటిని మూడు రకాలుగా చూపించాల్సి ఉంటుంది. మూడు సార్లు మూడు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించాలి.
టీనేజీలో ఉన్నప్పుడు నూనూగు మీసాలు తప్ప వేరే ఏవీ కనిపించకూడదు. పైగా బక్కగా ఉండాలి. అదే కాలేజ్ స్టూడెంట్ అంటే మీసాలు - గడ్డం పెరిగిపోతుంది. దానికోసం రగ్గుడ్ లుక్ ట్రై చేశాడు. కాలేజ్ కుర్రాడి రోల్ ని ఈపాటికే షూట్ చేసేశారు. ఇక మిడిలేజీ అంటే కాస్తంత పొట్ట పెంచి, ఒళ్లు పెంచి కనిపించాలి. అందుకే ఇప్పుడు కీలకమైన షెడ్యూల్స్ రాగానే దానికోసం రూపం మార్చుకునే పనిలో ఉన్నాడుట చైతూ. ముఖ్యంగా ఈ సినిమాకి ఎంతో కీలకమైన టీనేజీ కుర్రాడి రోల్ కోసం ప్రస్తుతం చైతూ ప్రిపరేషన్ లో ఉన్నాడు.
చైతూ ఇప్పటికే పెరిగిన బరువును తగ్గించుకునే పనిలో ఉన్నాడు. టీనేజీ కుర్రాడిలా కనిపించేందుకు పూర్తిగా బక్కపలుచగా తయారవుతాడుట. లుక్ వైజ్ పూర్తి డిఫరెన్స్ చూపించాలి కాబట్టి అందుకు కసరత్తు మొదలుపెట్టేశాడు. మరో రెండు షెడ్యూల్స్ తో మొత్తం సినిమా పూర్తవుతుంది. అదీ మ్యాటర్.