మూడు నెలల క్రితం వరకూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న నాగశౌర్య పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క సినిమా ఫ్లాప్ తో మొత్తం తలరాతే మారిపోయినట్లుగా అయిపోయింది. నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న మూవీ తప్ప.. చేతిలో వేరే ప్రాజెక్ట్ ఏదీ లేదు ఈ కుర్రహీరోకి. అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చేసింది.
చందమామ కథలుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య.. తర్వాత ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి వంటి చిన్ని చిత్రాల సక్సెస్ లతో బిజీగా మారిపోయాడు. వరస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇలాంటి టైంలో తీసుకున్న ఓ నిర్ణయం నాగశౌర్య కెరీర్ ని మార్చేసింది. అప్పటివరకూ లవర్ బోయ్ గా ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. యాక్షన్ హీరోగా మారిపోయి జాదూగాడిగా జనాల ముందుకొచ్చాడు. ఈ సినిమా కొట్టిన దెబ్బకి, అప్పటికే అడిగిన వాళ్లు కూడా మొహం చాటేసారు. చివరకు ఊహలు గుసగుసలాడే సీక్వెల్ కు కూడా వేరేవాళ్లను తీసేసుకున్నారు.. ఇదే కాదు.. మల్లెలతీరంలో - సిరిమల్లెపువ్వు చిత్రాలను తీసిన దర్శకుడు కూడా ఇతరులను తీసుకుని మూవీ మొదలు పెట్టేశాడు..
ఒక్క ఫ్లాప్ నాగశౌర్య కెరీర్ నే మార్చేసింది. సక్సెస్ ఉన్నంత కాలమే సినిమా ఫీల్డ్ లో డిమాండ్ ఉంటుంది అనే విషయం ఇతగాడికి బాగానే అర్ధమైంది. అందుకే నందినీ రెడ్డి తీస్తున్న చిత్రంపై బాగా ఆశలు పెట్టుకున్నాడు. చూద్దాం.. అలా మొదలైంది లాంటి సక్సెస్ మరోసారి నందినీరెడ్డి అందిస్తుందేమో. ఇకపోతే నందిని సినిమా కాకుండా, అబ్బాయితో అమ్మాయి అంటూ రమేష్ వర్మ రూపొందిస్తున్న ఫిలిం కూడా శౌర్య చేతుల్లో ఉంది. ఈ సినిమా కూడా దాదాపు పూర్తయ్యింది. రెండింట్లో ఏదో ఒక సినిమా మనోడికి బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే.