అంత ఇగో అవసరమా?

Update: 2018-03-06 04:24 GMT
ఫిదా బ్యూటీ సాయి పల్లవికి ఇగో ఎక్కువని.. తన కెరీర్ లో ఎక్కువ ఇరిటేట్ చేసిన హీరోయిన్ ఆమేనంటూ కొద్దిరోజుల క్రితం యంగ్ హీరో నాగశౌర్య ఓపెన్ గానే ఆమెపై ఫైరయ్యాడు. నాగశౌర్య - సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా కణం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగులో వీళ్లిద్దరి మధ్య భేదాభిప్రాయాలు బాగానే వచ్చాయి. ఆ కోపంతోనే నాగశౌర్య సాయిపల్లవిని తప్పుపట్టాడని అందరూ అనుకున్నారు. కానీ వాళ్లద్దరి కనీసం మొహాలు చూసుకోలేనంత రేంజీలో ఇగో క్లాషెస్ వచ్చాయి.

కణం సినిమా తమిళ వెర్షన్ కరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్దిరోజుల క్రితం చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ హీరో నాగశౌర్య అటెండవలేదు. అదేమంటూ గోవా షూటింగంటూ మాట దాటేశాడు. తాజాగా హైదరాబాద్ లో కణం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికొచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈవెంట్ కు అస్సలు రానేలేదు. కేవలం సాయి పల్లవికి ఎదురుపడాల్సి వస్తుందన్న కోపంతో తను హీరోగా నటించిన సినిమా ఈవెంట్ కు పూర్తిగా ఎగ్టొట్టేయడం సినిమా జనాలను ఆశ్చర్యపరిచింది.  హీరోయిన్ తో గొడవలొస్తే సినిమా ప్రమోట్ చేయకుండా తప్పించుకోవడం ఏమిటని.. ఈ విషయంలో అంత ఇగోకు పోవడం సరికాదని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.

నాగశౌర్య తనపై చేసిన కామెంట్స్ కు సాయి పల్లవి గతంలోనే రెస్పాన్స్ ఇచ్చింది. తాను ఎవరినీ హర్ట్ చేయాలని అనుకోలేదని... తను ఎందుకు ఫీలయ్యాడో అర్ధం కాలేదని చెప్పుకొచ్చింది. గొడవలను మనసులో పెట్టుకుని నాగశౌర్య రాకపోయినా తమిళం - తెలుగు రెండు ఈవెంట్లకు తనే హాజరై సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసింది సాయిపల్లవి. తరవాతయినా నాగశౌర్య కూడా సినిమా ప్రమోట్ చేస్తాడో.. ఇది సాయిపల్లవి సినిమా అని మొత్తంగా చేతులెత్తేస్తాడో చూడాలి.
Tags:    

Similar News