నీహారిక‌నో, ప‌వ‌న్‌ నో ఇంప్రెస్ చేయ‌క్క‌ర్లే

Update: 2016-01-04 04:30 GMT
గ‌త శుక్ర‌వారం రిలీజైన సినిమాల్లో నాగ‌శౌర్య హీరోగా న‌టించిన అబ్బాయితో అమ్మాయి ఒక‌టి. ఈ మూవీ ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో తెర‌కెక్కింది. న‌వ‌త‌రం అంతా ఫేస్‌ బుక్ ల‌వ్వాయ‌ణం సాగిస్తున్న తీరును ఇందులో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. కుర్రాళ్లంతా త‌మ అభిమాన హీరోల ఫోటోని ఫేస్‌ బుక్ ప్రొఫైల్‌ లో పెట్టుకుని అమ్మాయిల‌కు లైనేస్తుంటే, అమ్మాయిలంతా ఏ స‌మంత‌నో - త్రిష ఫోటోనో పెట్టుకుని అబ్బాయిల‌కు వ‌ల‌లు వేస్తున్నారు. ఈ పాయింటునే ల‌వ్‌ లీ గా చెప్పాల‌నుకున్నారు ద‌ర్శ‌కుడు.

అయితే హీరో నాగ‌శౌర్య త‌న ఫేస్‌ బుక్ ఫోటోగా ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ఫోటో పెట్టుకోవ‌డం ప‌వ‌న్ అభిమానుల్లో డిస్క‌ష‌న్‌ కి వ‌చ్చింది. మెగా ఫ్యాన్స్ అంతా ఈ విషయంపైనే చ‌ర్చించుకుంటున్నారు. ఎలాగూ ఒక్క మ‌న‌సు సినిమాలో కొణిదెల వార‌మ్మాయి నీహారిక‌తో క‌లిసి న‌టిస్తున్నాడు. త‌న‌ని ఇంప్రెస్ చేయ‌డానికో, లేక ప‌వ‌న్‌ ని ఇంప్రెస్ చేయ‌డానికో శౌర్య ఇలా చేసి ఉంటాడులే అన్న చ‌ర్చ సాగుతోంది. అయితే దీనికి నాగ‌శౌర్య ఓ వివ‌ర‌ణ ఇచ్చాడు.

అబ్బే అలాంటిదేం లేదండీ .. . నేను నాగార్జున‌ - జూ.ఎన్టీఆర్‌ ల‌కు అభిమానిని. అందువ‌ల్ల ఆ ఫేస్‌ బుక్ ఇమేజ్ వాళ్ల‌లో ఎవ‌రో ఒక‌రిది పెట్ట‌మ‌ని ద‌ర్శ‌కుడిని అడిగాను. కానీ వాళ్లు మాత్రం ప‌వ‌న్‌ నే ప్రిఫ‌ర్ చేశారు. డైరెక్ట‌ర్ ఏం చెబితే అది చేశానంతే. అయినా ప‌వ‌న్‌ని అభిమానించ‌ని వాళ్లెవ‌రైనా ఉంటారా? అంటూ కొస‌మెరుపు మెరిపించాడీ కుర్ర‌హీరో. దీన్ని బ‌ట్టి కావాల‌ని శౌర్య ప‌వ‌న్ ఇమేజ్‌ ని పెట్టుకోలేద‌ని, హీరోయిన్ సైతం కావాల‌నే స‌మంత ఫోటో పెట్టుకోలేద‌ని అర్థ‌మ‌వుతోంది.
Tags:    

Similar News