స్టార్ డమ్ అనేది రామ్ చరణ్ తో ఆగిపోయింది!

Update: 2018-08-25 06:34 GMT
ఫ్రీడమ్ అనేది కామన్  పీపుల్ కు ఎక్కువ.  ఉదాహరణకు మనం మాటల్లో శ్రీ నరేంద్ర మోడీ గారు.. మెగాస్టార్ చిరంజీవి గారు.. అని గౌరవ వచనాలతో పిలవం ఏకవచనంతోనే మోడీ.. చిరు అని అంటాం. కానీ అదే సెలబ్రిటీస్  విషయానికి వస్తే వాళ్ళు అందరికీ తప్పనిసరిగా గౌరవం ఇవ్వాల్సిందే.  సూపర్ స్టార్.. గారు అని ప్రిఫిక్స్ లు.. సఫిక్స్ లు మహేష్ బాబు తగిలించనందుకు 'గూఢచారి' బ్యూటీ శోభితను ఫ్యాన్స్ గట్టిగా తగులుకున్నారు కదా.  అంతే కాదు కొన్నిఅభిప్రాయాలను ఓపెన్ గా చెప్పినా వాళ్ళకు ఇబ్బందే.

చూస్తుంటే నాగ శౌర్య స్టార్ - స్టార్ డమ్ కామెంట్స్ కు కూడా కాస్త హీట్ తగిలేలా ఉంది.  శౌర్య కొత్త సినిమా '@నర్తనశాల' వచ్చే శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో స్టార్ అనే అనే టాపిక్ పై మాట్లాడాడు.

"ఇప్పుడు ఎవరికీ ఫ్యాన్స్ లేరండి. ఇది నిజం. ప్రేక్షకులు జస్ట్ ఇష్టపడతారు అంతే. చిరంజీవి గారు .. బాలకృష్ణ గారు .. నాగార్జున.. వెంకటేష్.. ఎన్టీఆర్.. రామ్ చరణ్... ఫాలోయింగ్ అంతటితో ఆగిపోయింది. ఇప్పుడు పూజలు చేయడం ఆపేశారు. పవన్ కళ్యాణ్ లాంటి హీరోలందరూ ఒక రేంజ్ అప్పట్లో. ఈ కాలంలో ప్రమోషన్ అని... ఈవెంట్స్ అని తరచుగా ఆడియన్స్ కు కనిపించడంతో వాళ్ళకు హీరోలు దేవుళ్ళలా కనిపించడం లేదు. ఒకప్పుడు ఫిలిం నగర్ కు బస్సులు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  హీరో రోజూ ఆడియన్స్ కు కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు స్టార్ ఎలా అవుతాడు.  ఇప్పుడుండేవాళ్ళు ఎవరూ స్టార్ కారండి.  ఎవరైనా స్టార్ అని అన్నా నమ్మొద్దు."

మరి విజయ్ దేవరకొండ ను రీసెంట్ గా అందరూ స్టార్ అంటున్నారు కదా.. యూత్ లో ఫాలోయింగ్ ఉంది కదా అని అడిగితే... "అది ఫాలోయింగ్ అండీ.. సస్టెయిన్ అవ్వాలి కదా? సస్టెయిన్ అయితే చాలా బెటర్. అంతకంటే మంచిది లేదు.  అప్పట్లో తరుణ్ కు ఉన్న క్రేజ్ ఇప్పట్లో ఏ హీరోకు లేదు. ఇప్పుడు స్టార్లు అంటూ ఎవరూ లేరు. అది తెలుసుకుంటే బెటర్. ఇప్పుడు పొరపాటున పది ఫ్లాపులు వస్తే హీరోగా ఆదరిస్తారా. అందరికంటే నాకు గ్రేట్ అనిపించింది నితిన్. తనకు 16  ఫ్లాపులు వచ్చాయి.  ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే నాకు నితిన్ అంటే చాలా ఇష్టం."

లాజిక్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది గానీ రౌడీ ఫ్యాన్స్ కు నచ్చుతుందో లేదో. మరోవైపు ఇక కొత్తగా స్టార్లు రారు అని శౌర్య కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాడు. మరి దీన్ని ఎంతమంది ఆమోదిస్తారో ఎంతమంది వ్యతిరేకిస్తారో చూడాలి.  కొంతమంది బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు స్టార్ అయ్యేందుకు చెయ్యని ప్రయత్నాలు లేవు.  శౌర్య లాజిక్ ప్రకారం వాళ్ళు ప్రయత్నాలు ఆపేయడం మంచిదేమో!


Tags:    

Similar News