తనకు ఏ ఇమేజ్ అయినా ఓకే కానీ లవర్ బాయ్ ఇమేజ్ మాత్రం వద్దే వద్దంటున్నాడు నాగశౌర్య. ఆ ఇమేజే తన కెరీర్ కు చాలా ఇబ్బందికరంగా మారిందని శౌర్య చెబుతున్నాడు. ‘‘నన్ను మొదట్లో అందరూ లవర్ బాయ్ అని.. చాక్లెట్ బాయ్ అని అన్నారు. దీంతో నాకు వరుసగా అలాంటి పాత్రలే వచ్చాయి. నాపై అలా ఓ ముద్ర వేసేశారు. జాదూగాడు సినిమాతో కొంచెం వెరైటీగా ట్రై చేస్తే ఆ సినిమాను ఆదరించలేదు. అది మంచి సబ్జెక్ట్ అయినా జనాలు చూడలేదు. నేను నిజానికి చాక్లెట్ బాయ్ టైపు కాదు. చాలా రఫ్ గా ఉంటాను. నాకు మాస్ పాత్రలంటే బాగా ఇష్టం కూడా. అసలు నాలో రొమాంటిక్ యాంగిలే లేదనుకుంటూ ఉంటా’’ అని శౌర్య అన్నాడు.
మీకు మంచి లేడీ ఫాలోయింగ్ ఉంది కదా అని అంటే.. ‘‘నాకు కాదు మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున.. వీళ్లకుంది భారీగా లేడీ ఫాలోయింగ్. అలాగని వాళ్లేమీ లవర్ బాయ్ పాత్రలే చేయట్లేదు. అందుకే కొంచెం లేడీ ఫాలోయింగ్ ఉంది కదా అని లవర్ బాయ్ వేషాలే వేయాలనుకోవట్లేదు. అసలు నాకు ఈ ట్యాగులేమీ వద్దు. నేను మంచి నటుడిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా’’ అని శౌర్య చెప్పాడు. తన కొత్త సినిమాలు, వాటిలోని పాత్రల గురించి శౌర్య వివరిస్తూ.. ‘‘కళ్యాణ వైభోగమే సినిమాలో ప్రతి తల్లీ కోరుకునే కొడుకులా, ‘ఒక్క మనసు’లో ప్రతి అమ్మాయి కోరుకునే భర్తలా, ‘జ్యో అచ్యుతానంద’లో ప్రతి వ్యక్తీ కోరుకునే సోదరుడిలా కనిపిస్తా. ఈ మూడు సినిమాలూ నాకు చాలా స్పెషల్’’ అన్నాడు.