మెగా డాటర్ నీహారికను హీరోయిన్ గా పరిచయం చేస్తూ తీసిన చిత్రం ఒక మనసు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో హీరో నాగ శౌర్య. మొదటి నుంచి ఒక మనసుపై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు ఇగో ప్రాబ్లెమ్స్ తో ఇబ్బంది పడుతున్నాడనే టాక్ మొదలైంది. ప్రతీ విషయంలోనూ నీహారికకే ఇంపార్టెన్స్ ఇస్తుండడం ఈ కుర్రాడిని బాగా హర్ట్ చేస్తోందని అంటున్నారు.
ఒక మనసు ఆడియో ఫంక్షన్ లోనే మెగాడాటర్ భజన మొదలైపోయింది. అందరూ నీహారికనే తెగ పొగిడేశారు. పనిలో పనిగా తాను కూడా పొగిడాడు నాగశౌర్య. కానీ ఇప్పుడు సినిమా పబ్లిసిటీలో కూడా అంతా నీహారిక చుట్టూనే తిరుగుతోంది. ఎవరూ నాగశౌర్యని పట్టించుకోవడం లేదు. దీంతో ఈ హీరో బాగా ఫీల్ అవుతున్నాడట. ఈ మధ్యనే ఓ టీవీ ఛానల్ వాళ్లు గేమ్ షోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తే.. నాగశౌర్య చెప్పిన మాట విని షాక్ అయ్యారని తెలుస్తోంది.
గేమ్ షోకి తాను ఒక్కడిని అయితే మాత్రమే వస్తానని.. నీహారికతో కలిపి అయితే రాబోనని తేల్చేశాడట నాగశౌర్య. పైగా ఈ మూవీకి రెమ్యూనరేషన్ విషయంలో కూడా తనను చిన్నచూపు చూశారనే ఫీలింగ్ లో ఉన్నాడని తెలుస్తోంది. నీహారికకు 60 లక్షలు ఇచ్చిన నిర్మాతలు.. హీరో నాగశౌర్యకు 50 లక్షలు మాత్రమే ఇవ్వడం షాక్ కొట్టిందట. అందుకే నీహారిక ఉండే ప్రోగ్రామ్స్ నో చెబుతున్నాడని అంటున్నారు.