ఫలానా హీరోయిన్‌తో నాకు ఎఫైర్ ఉన్నట్లు ఎందుకు వార్తలు రాశారు అని అడిగే వాళ్లను చూస్తాం. కానీ నాగశౌర్య మాత్రం తనకు, రాశిఖన్నాకు ఎఫైర్ ఉందని ఎప్పుడూ వార్తలు రాయరేంటి అని ప్రశ్నించి ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ శౌర్య అలా అనడానికి కారణమేంటో అతడి మాటల్లోనే విందాం పదండి. ''నాకు ఆ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందని.. ఈ హీరోయిన్‌తో పబ్‌లో కనిపించానని పుకార్లు పుట్టిస్తున్నారు. రెజీనాతో నాకు ముడిపెట్టి వార్తలు రాశారు. ఐతే నాకు రెజీనాతో పరిచయమే లేదు. ఇంకే హీరోయిన్‌తో కూడా ఎఫైర్ లేదు. హీరోయిన్లలో నాకు క్లోజ్ అంటే రాశి ఖన్నానే. హీరోగా నా తొలి సినిమా 'ఊహలు గుసగుసలాడే'లో తనే హీరోయిన్.
తనకు కూడా అది తొలి సినిమా కావడంతో ఇద్దరం క్లోజ్ అయ్యాం. ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు కూడా కొనసాగుతోంది. తనతో కలిసే నేను హ్యాంగౌట్ అవుతా. పార్టీలకు, పబ్‌లకు వెళ్తుంటా. కానీ వేరే వాళ్లతో ఎఫైర్లున్నట్లు రాశారు కానీ.. ఆశ్చర్యకరంగా రాశి ఖన్నాకు, నాకు ముడిపెట్టి ఎవరూ ఏమీ రాయలేదు. ఈ విషయం నాకు ఆశ్చర్యంగా అనిపించి.. రాశికి కూడా ఓసారి ఫోన్ చేసి చెప్పా. అవునా అంటూ తను కూడా ఆశ్చర్యపోయింది'' అని చెప్పాడు శౌర్య. తాను ఏడేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని.. ఐతే ఆ అమ్మాయి అందుకు ఒప్పుకునేలా లేదని చెబుతూ.. ఆ అమ్మాయి ఎవరని అడిగితే.. ''అనుష్క'' అని చమత్కరించాడు నాగశౌర్య.