ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా అరంగేట్రం చేస్తున్న మెగా డాటర్ నీహారికకు జంటగా నటించాడు యంగ్ హీరో నాగశౌర్య. స్టేజ్ పై మైక్ తీసుకోగానే మెగా ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేసేసరికి.. 'నాకసలే టెన్షన్.. ప్లీజ్.. వచ్చిందే కాస్త తెలుగు.. మర్చిపోయేలా ఉన్నా..' దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని నాగశౌర్య అనడంతో ఆడిటోరియం నవ్వులతో నిండిపోయింది. షూటింగ్ జరుగుతున్నంత సేపు ఏం ఆలోచించకుడా సినిమా పూర్తయిపోయిందని.. రామరాజుగారు నేరేట్ చేసిన విధానమే సినిమా ఇంత బాగా రావడానికి కారణమని చెప్పాడు ఈ హీరో.
'మెగాస్టార్ - రామ్ చరణ్.. ఇలా పలు ఆడియో ఫంక్షన్ లకు వెళ్లాను. కానీ నాకు ఆ మొత్తంలో "నీహారిక ఆల్ ది బెస్ట్" అన్న పోస్టర్ బాగా నచ్చింది. ఇకపై అన్ని మెగా ఫంక్షన్ లలోను నీహారిక పోస్టర్ కూడా తప్పకుండా కనిపిస్తుంది. నేను 80-90ల్లో సావిత్రి గారి గురించి విన్నాను. 90లకు వచ్చేసరికి సౌందర్య గారన్నా ఆవిడ యాక్టింగ్ అన్నా బాగా ఇష్టం. 2000 తర్వాత అనుష్క పర్సనల్ గా నచ్చింది. సినిమాను తమ భుజాలపై మోయగల హీరోయిన్స్ వీళ్లంతా. వీళ్లందరి తర్వాత.. ఇప్పుడున్న జనరేషన్ లో మనం ఓ హీరోయిన్ అలాంటి స్థాయిని అందుకుంటుదని చెప్పుకోవాలంటే నీహారిక ఒకటే' అని నాగశౌర్య అనడంతో.. మెగా ఫ్యాన్స్ హంగామా చేసేశారు.
'చివరగా ఒకమనసు మూవీ గురించి ఒక మాట చెప్పాలి. కమల్ హాసన్ గారి మూవీ సాగర సంగమం మన ముందు జనరేషన్ లో వచ్చింది. మన అన్నలు అక్కల కాలంలో గీతాంజలి నిలిచిపోయింది. ఇప్పుడు మన జనరేషన్ లో ఒక మనసు ఈ స్థాయిలో నిలిచిపోతుంని చెప్పగలను. మేం జీవితాంతం ఈ సినిమా చేశామని గర్వంగా చెప్పుకోగలగుతాం' అంటూ నాగశౌర్య ఫినిషింగ్ ఇవ్వడంతో.. ఇప్పుడీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి.