మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల సొంత యూట్యూబ్ ఛానల్ 'మన ఛానల్ మన ఇష్టం' ద్వారా అన్ని విషయాలపై స్పందిస్తూ ఉన్నారు. కుటుంబ విషయాలు, సినిమా సంగతులతో పాటు పలు సామాజిక అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తల్లిదండ్రులతో పిల్లల అనుబంధం గురించి మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా తన పిల్లలు నిహారిక - వరుణ్ తేజ్ లతో తన ప్రవర్తన ఎలా ఉంటుందనే విషయం వెల్లడించాడు. నాగబాబు మాట్లాడుతూ.. ''నేను గొప్ప కమ్యూనికేటర్ ని కాకపోవచ్చు గానీ ఎంతో కొంత బెటర్ అని నా ఫీలింగ్. నా పిల్లలు నిహారిక, వరుణ్ లకు చాలా విషయాలు చెప్పేవాడిని. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తిట్టడం, కొట్టడం లాంటివి కూడా చేసేవాడిని. నిహారిక, వరుణ్ లను ఒకటి రెండు సార్లు కొట్టాను. కానీ పిల్లలను కొట్టకూడదు. అది నేను చేసిన తప్పు. ఆ టైమ్ లో నాకు మెచ్యూరిటీ లేక అలా చేశాను" అని చెప్పారు.
"నేను పిల్లలకు ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. మీరు మొదట తల్లిదండ్రులతో ఫ్రీ గా మాట్లాడండి. అన్నీ షేర్ చేసుకోండి. నా పిల్లలని పిలిచి వాళ్లకు ఓ గ్యారెంటీ ఇచ్చాను. 'ఈ భూమి మీద మీ జీవితంలో ఏ సమస్యను అయినా నేనొక్కడిని మాత్రమే అర్థం చేసుకొని పరిష్కరించగలను. చెప్పుకోలేని సమస్య వచ్చినా చెప్పండి. ఎందుకంటే ఈ భూమిపై మీ కంటే నాకు విలువైన వాళ్ళు ఎవ్వరూ లేరు' అని చెప్పాను. నా పిల్లలతో కమ్యూనికేట్ కావడంలో ఎలాంటి దాపరికాలు పెట్టుకోలేదు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో వరుణ్ సినిమాల్లోకి వస్తా అంటే వెంటనే సరే అనేశాను. ఒకవేళ నటుడిగా సక్సెస్ కాకపోతే డిజప్పాయింట్ కావొద్దని చెప్పాను. నువ్ ఎలా ఉన్నా సరే యూ ఆర్ మై సన్. అదే విధంగా నిహారికకు చెప్పా. మీరు సాధించినా, సాధించకపోయినా అది మీ వ్యక్తిగతం. అంతేగానీ నా కొడుకు, కూతురు సక్సెస్ కాలేదని నేను బాధపడను. నాకు పిల్లలు సంతోషంగా ఉండాలి అంతే. అలానే వాళ్ళను కమ్యూనికేట్ చేశాను" అని నాగబాబు చెప్పుకొచ్చారు.
Full View