వన్ అండ్ హాఫ్ తీసి అయ్యో వద్దంటే ఎలా..?

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఒకడైన వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

Update: 2025-01-16 22:30 GMT

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఒకడైన వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సినిమాలో ఉన్నాడు అంటే ఆ ఎపిసోడ్స్ అంతా ఫుల్ ఫన్ అన్నట్టే లెక్క. స్టార్ సినిమాల్లో ఫ్రెండ్ రోల్స్ చేస్తూ వెన్నెల కిశోర్ తన సత్తా చాటుతూ వచ్చారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా తన హండ్రెడ్ పర్సెంట్ తో ఆడియన్స్ ని నవ్విస్తూ ఉంటాడు. అందుకే వెన్నెల కిషోర్ కి మంచి గుర్తించి వచ్చింది. ఐతే లేటెస్ట్ గా ఒక సినిమా ఈవెంట్ లో బ్రహ్మానందం కూడా వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి మెచ్చుకున్నారు.

తన లెగసీని కొనసాగిస్తున్న వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ అంటూ కిశోర్ పై తన ప్రేమను చూపించారు బ్రహ్మి. ముఖ్యంగా వారు నటించిన సినిమాలో ఒక సీన్ లో వెన్నెల కిషోర్ కామెడీని తను నవ్వుతూ ఉన్నానని అలా ఆరు ఏడు టేకుల దాకా అయ్యాయని అన్నారు. ఇక ఇదే క్రమంలో వెన్నెల కిషోర్ తో జర్నీ అంటూ అతని డైరెక్షన్ లో సినిమా గురించి చెప్పబోగా వద్దు అని అనేశాడు వెన్నెల కిషోర్. అంతేకాదు ఇది కట్ చేయండి అంటూ అని కెమెరాకు సైగ చేశాడు.

వెన్నెల కిషోర్ మంచి కమెడియన్ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల గురించి బ్రహ్మానందం మాట్లాడుతుంటే ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడన్నది తెలియదు. ఐతే వెన్నెల కిషోర్ రెండు సినిమాలను డైరెక్ట్ చేశారు. అందులో ఒక వెన్నెల వన్ అండ్ హాఫ్ కాగా రెండోది జఫ్ఫా. జఫ్ఫాలో బ్రహ్మానందం కూడా నటించారు. మరి కమెడియన్ గా మంచి ఫాం లో ఉన్నప్పుడు డైరెక్టర్ కిషోర్ గురించి ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ బ్రహ్మానందం అలా స్టార్ట్ చేయగానే ఇలా ఆపేయమన్నాడు.

బ్రహ్మానందం మాత్రం వెన్నెల కిషోర్ కామెడీ బాగుంటుందని.. సినిమాలో అతనితో కలిసి నటించడం షూటింగ్ కూడా చాలా సరదాగా సాగిందని అన్నారు. నా లెగసీని వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్లు కొనసాగిస్తారని బ్రహ్మి చెప్పడం అందరినీ అలరించింది. వెన్నెల కిషోర్ కూడా తప్పకుండా అంత ప్రతిభ గల కమెడియన్ అని ఆడియన్స్ చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News