పవన్ చదవమంటున్న ఆ బుక్ ఏంటంటే..

Update: 2017-02-01 06:18 GMT
టాలీవుడ్ సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ గురించి చిన్నా పెద్దా ఎవరిని అడిగినా వినిపించే ఒకే మాట.. ఆయన్ను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఒకరకంగా చూస్తే.. సొంత ఫ్యామిలీ మెంబర్స్ కే అర్ధం కాని పవన్ మనస్తత్వాన్ని మిగిలిన వారిని క్యాచ్ చేయడం దాదాపు అసంభవం అనాల్సిందే.

అలాగే బుక్ రీడింగ్ విషయంలో పవర్ స్టార్ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా  తనను ఓ పుస్తకం చదవమని తమ్ముడు చెప్పాడంటూ మెగా బ్రదర్ నాగబాబు అన్నాడు. రిచర్డ్ బాక్ రాసిన ఆ పుస్తకం పేరు 'జోనాథన్ లివింగ్ స్టన్ సీగల్'. పేరు గుర్తు పెట్టుకోవడానికే కొంచెం క్లిష్టంగా ఉన్న ఈ పుస్తకంలో ఉండే మేటర్ ఏంటంటే.. సముద్రాలపై ఎగిరే పక్షి సీగల్ జీవితమే. సీగల్ ద్వారా మనుషులు తమకు ఉన్న పరిధిలు.. పరిమితులు ఎలా అధిగమించాలని చెబ్తాడు రచయిత.

ఇదే మేటర్ ని ఇంకా చెప్పాలంటే స్వయం శక్తితో ఎలా ఎదగాలో చెప్పే ఓ ఫిలాసఫీకి సంబంధించిన బుక్ అన్నమాట. ఇలాంటి పుస్తకాలను చదవడం.. అర్ధం చేసుకోవడం.. ఆచరణలో పెట్టడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఫిలాసఫీ లవర్స్ కి తప్పితే మిగిలిన వారికి అణుమాత్రం కూడా అర్ధం కాదంటారు సాహిత్యవేత్తలు. గతంలో పవన్ రాసిన పుస్తకం 'ఇజం'ను చదివి అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించిన పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఈసారి ఏం చేస్తారో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News