నాగబాబు సార్.. వర్మను దెబ్బ కొట్టాలా?

Update: 2017-01-08 07:47 GMT
రామ్ గోపాల్ వర్మ చాలామంది గురించి చాలా మాట్లాడుతుంటాడు. కానీ అందరూ ఆయన వ్యాఖ్యలకు స్పందించరు. వర్మ వ్యాఖ్యలపై స్పందించినా.. కౌంటర్ ఇచ్చినా ఆయన మరింత రెచ్చిపోతారు. మాటలతో వర్మను గెలవడం చాలా కష్టమని అందరికీ తెలుసు. పైగా కొత్త కొత్త విషయాలు తెరమీదికి తెచ్చి డిఫెన్స్‌లోకి నెట్టడం వర్మకు వెన్నెతో పెట్టిన విద్య. అందుకే చాలామంది ఆయన విషయంలో సైలెంటైపోతుంటారు. ఆయన వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటుంటారు. కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అలా సైలెంటుగా ఉండలేకపోయారు. మెగా అభిమానుల్ని చూసి.. అన్నయ్యను చూసి ఉద్రేకం తెచ్చుకుని వర్మ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఇక ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ట్విట్టర్లో తనదైన శైలిలో చెలరేగిపోయాడు వర్మ. ముందు నాగబాబు సహా మెగా ఫ్యామిలీలో అందరికీ సారీ చెప్పి.. ఆ తర్వాత ఎవడో తన ట్విటర్ అకౌంటుని హ్యాక్ చేశాడని కలరింగ్ ఇచ్చి.. ఆపై నాగబాబును టార్గెట్ చేసుకుని ట్వీట్ల వర్షం కురిపించాడు. దీంతో ‘ఖైదీ నెంబర్ 150’ వేడుక విశేషాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. చర్చంతా నాగబాబు వెర్సస్ వర్మ అనే టాపిక్ మీదికి వెళ్లిపోయింది. ఆ వేడుకలో చిరు ఏం మాట్లాడాడు.. ట్రైలర్ ఎలా ఉంది.. లాంటి విషయాల గురించి కాకుండా ఈ గొడవ గురించే అందరూ చర్చించుకున్నారు. ప్రి రిలీజ్ ఈవెంట్ అవ్వాల్సినంత హైలైట్ కాలేదు. వర్మను ఇగ్నోర్ చేయడమే అతడి దెబ్బ కొట్టడానికి సరైన మార్గం అనే విషయం తెలియక అనవసరంగా వ్యాఖ్యలు చేసి వర్మ ఉచ్చులో చిక్కుకున్నాడు నాగబాబు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News