చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టినప్పుడు పవన్ కాలికి బలపం కట్టుకుని తిరిగాడు. మరి.. ఇప్పుడు పవన్ జనసేన పార్టీ పెట్టి 2019 ఎన్నికలకు రెడీ అవుతున్న తరుణంలో పవన్ కోసం చిరు ప్రచారం చేస్తారా అన్న సందేహం చాలాకాలంగా ఉంది. కానీ... పరిస్థితులు మాత్రం అలాంటి సీనేమీ లేదన్నట్లుగా ఉన్నాయి. అయితే.. పవన్ - చిరుల మరో సోదరుడు నాగబాబు మాత్రం పవన్ వెనుక తమ కుటుంబమంతా ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. పవన్ కోసం చిరు ప్రచారం చేస్తే బాగుంటుందని కూడా నాగబాబు ఆకాంక్షించారు. టీవీ 9 న్యూస్ చానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నాగబాబు ఈ విషయం తెలిపారు.
నిజానికి పవన్ - చిరులు కొన్నేళ్ల కిందట వరకు కలిసే నడిచారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన తరువాత ఇద్దరి దారులు వేరయ్యాయి. ఆ తరువాత మొన్నటి ఎన్నికల నాటికి చిరు కాంగ్రెస్ లో ఉండగా పవన్ మాత్రం బీజేపీ - టీడీపీల తరఫున ప్రచారం చేశారు. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా చెడ్డాయి. పేరుకు తామంతా ఒకటే అని చెబుతున్నా కూడా అదంతా ప్రజల కోసమే అన్న భావన ఉంది.
మరోవైపు పవన్ - చిరుల కాంబినేషన్ కోసం చాలా ప్రయత్నమే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా సినిమాల్లోనైనా ఇద్దరినీ ఒకే మూవీలో చూపించాలన్న ప్రయత్నం కూడా ఉంది. రీసెంటుగా సుబ్బరామిరెడ్డి దీనిపై ప్రకటన చేశారు. చిరంజీవి - పవన్ లు ఇద్దరినీ కలిపి సినిమా తీస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది సినిమాల్లో సాధ్యమేమో కానీ, రాజకీయాల్లో మాత్రం ఇద్దరూ కలవడం కష్టమని అంటున్నవారే ఎక్కువగా ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/