మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవి పాకులాట ప్రతిసారీ చర్చనీయాంశమే. ఇంతకుముందు శివాజీ రాజా- సీనియర్ నరేష్ మధ్య పోటీ వేడెక్కించింది. ఈసారి ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు మధ్య వార్ ముదురుతోంది. ఆ ఇద్దరూ నువ్వా నేనా? అంటూ అధ్యక్ష పదవికి పోటీపడేందుకు ప్యానెల్స్ ని రెడీ చేసుకుంటున్నారు.
ఈసారి మంచు విష్ణు రూపంలో గట్టి పోటీ ఎదురవ్వడంతో సడెన్ సర్ ప్రైజ్ గా మారింది. ప్రకాష్ రాజ్ తన అభ్యర్థిత్వం కోసం కాన్వాస్ చేయడానికి చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారని ఆయన మెగా కాంపౌండ్ ని లాక్ చేశారని కూడా టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరు పోటీదారులకు పరిశ్రమలో మంచి మద్దతు ఉంది. పరిశ్రమలోని కొంతమంది పెద్ద స్టార్లను కలుస్తున్నారు. వారి ప్యానెల్ లకు మద్దతు ఇవ్వమని అడుగుతున్నారు.
అయితే ఎవరు ఎవరికి మద్ధతిస్తారు? అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇంతలోనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ నాగా బాబు .. ప్రకాష్ రాజ్ పై ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యపరిచింది. ప్రకాష్ రాజ్ MAA అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి తన మద్దతును ప్రకటించారు. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి `మా` అధ్యక్షుడైతే తెలుగు చిత్ర పరిశ్రమకు లాభం చేకూరుతుందని నేను నమ్ముతున్నాను. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తాం. ప్రకాష్ రాజ్ ఒక నిర్దిష్ట చిత్ర పరిశ్రమకు చెందినవాడు కాదు. అతను పాన్-ఇండియా నటుడు అని నాగబాబు ప్రశంసలు కురిపించారు.
నిజానికి జనసేనకు వ్యతిరేకంగా ఉన్న ప్రకాష్ రాజ్ కి మెగా బ్రదర్ మద్ధతునివ్వడం ఆశ్చర్యపరిచేదే. తనకు ప్రకాష్ రాజ్ మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నా.. మా ఎన్నికల విషయంలో సోదరభావం వ్యక్తం చేయడం .. చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం ప్రకాష్ రాజ్ కృషి చేస్తారని నాగబాబు అనడం వేడెక్కించింది.