యువ సామ్రాట్ నాగచైతన్య .జోష్. చిత్రంతో నటుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భారీ విజయం సాధిస్తుందని నాగార్జున ఈ కథతో లాంచ్ చేసారు. కానీ అందరి అంచనాలు తప్పయ్యాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు తొలి నుంచి ఎక్కడో డౌట్ కొట్టింది.
ఆయన ఊహించినట్లుగానే .జోష్. అలాంటి ఫలితాలు సాధించింది. అయితే ఈ సినిమా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో రిలీజ్ అయిందన్నది వాస్తవం. ఆ కారణం సినిమా ఫలితంపై కొంత ప్రభావాన్ని చూపింది. 2009 సెప్టెంబర్ 3న రిలీజ్ కావాల్సిన సినిమా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో అదే నెల 5వ తేదీకి వాయిదా పడింది.
ఈ డిలే సినిమా ఫలితంపై పడిందని రాజుగారు అంటుంటారు. థియేటర్లు బంద్ చేయడం మళ్లీ తెరుచుకోవడం వంటి అంశాలు సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావాన్ని చూపించాయన్నారు. కంటెంట్ పరంగానూ కొంత మిస్ ఫైర్ అయిందన్నది అభిప్రాయపడ్డారు. అప్పటికి చైతన్యకి తొలి సినిమా కావడంతో ఆయన ఎంతో ఒత్తిడికి గురైనట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు.
మొదటి రోజు హీరోలంతా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారు. కానీ నేను అంత ధైర్యం చేయలేను. నా సినిమా విడుదల మొదటి రోజు తీవ్రమైన అందోళనకి గురవుతాను. .జోష్. తో మొదలైన ఆటెన్షన్ ఇప్పటికీ ఉంది.
ఆడియన్స్ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్లకి నచ్చుతుందా? నచ్చదా? అలా జరిగితే! మధ్యలో నుంచి లేచి వెళ్లిపోతారా? ఇలా ఎన్నో టెన్సన్ లు రిలీజ్ రోజున కలుగుతాయి. అదో మచ్చలా భావిస్తాను. అందుకే ఫస్ట్ షో అందరితో పాటు కలిసి చూడలేను. అని చెప్పుకొచ్చారు.
ఇటీవలే నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ చిత్రం .లాల్ సింగ్ చడ్డా. ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. మరి ఈ సినిమా విషయంలో కూడా చైతన్య అలాంటి టె న్సన్ కే గురై ఉండొచ్చు. ఫలితాల నేపథ్యంలో చై కాస్త మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. ఇందులో చైతన్య బాల రాజు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.