సాహసం స్వాసగా సాగిపో... చైతూ...

Update: 2015-08-22 04:10 GMT
పొయిటిక్‌ టైటిల్స్‌ పెట్టడంలో గౌతమ్‌ మీనన్‌కు గౌతమ్‌ మీననే సాటి. ఆయన తరువాతే ఎవరైనా. ఏ మాయ చేశావే, ఎటో వెళ్ళిపోయింది మనస్సు.. వంటి సినిమాల పేర్లు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. తెలుగులో కంటే తమిళంలో ఆయన ఇంకా అద్భుతంగా నేమింగ్‌ చేస్తాడు. ఇకపోతే నాగచైతన్యకు తొలి బ్లాక్‌ బస్టర్‌ అందించిన గౌతమ్‌, ఇప్పుడు మనోడితో రెండో సినిమా చేస్తున్నాడు.

తెలుగులో చైతూ, తమిళంలో శింబులను పెట్టి బైలింగువల్‌ సినిమాగా రూపొందుతున్న ఈ రోడ్-యాక్షన్‌-రొమాన్స్‌ సినిమాకు ఫైనల్‌ గా ఒక టైటిల్‌ పెట్టారు. అప్పట్లో  మహేష్‌ తొలి బ్లాక్‌బస్టర్‌ 'ఒక్కడు' సినిమాలో వచ్చిన సాహసం స్వాసగా, సాగిపో సోదరా అనే పాట నుండి ఇనస్సయిర్‌ అయ్యి.. మనోళ్ళు ''సాహసం స్వాసగా సాగిపో'' అంటూ ఈ సినిమాకు ఒక టైటిల్‌ అందించేశారు.

ఇకపోతే ఇదే ఏడాదిలో చైతూ అఖిల్‌ సినిమా వచ్చి వెళ్ళిపోగానే అక్కినేని అభిమానులకు డబుల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఇస్తాడట. పైగా నాగార్జున కూడా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో వచ్చేస్తా అంటున్నారు. మొత్తానికి వచ్చే మూడు నెలల్లో అక్కినేని ఫ్యామిలీ ఫుల్‌ కిక్‌ ఇవ్వనుందనమాట.
Tags:    

Similar News