పోలీసులు 2.0 ను ఇలా వాడుతున్నారు!

Update: 2018-12-11 05:52 GMT
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.0' సినిమా తెలుగు-తమిళ వెర్షన్ల కంటే ముఖ్యంగా హిందీ వెర్షన్ జోరు ఎక్కువగా ఉంది.  హిందీ వెర్షన్ అక్కడి ప్రేక్షకులను బాగా మెప్పిస్తోంది.  రజనీ కంటే ఎక్కువగా అక్షయ్ కుమార్ ఫ్యాక్టర్ హిందీ వెర్షన్ కు వర్క్ అవుట్ అయిందని అంటున్నారు.  అక్షయ్ పోషించిన పక్షి రాజు పాత్ర ఇప్పటికే అక్కడ ఫుల్ పాపులర్ అయింది.

ఎప్పుడైనా ఒక సినిమా.. అందులోని డిఫరెంట్ క్యారెక్టర్లు క్లిక్ అయినప్పుడు వాటిని ప్రజలు కూడా ఓన్ చేసుకుంటారు. ఇక '2.0' లోని పక్షి రాజు పాత్ర ను నాగ్ పూర్ పోలీసులు ఒక మంచి పనికి వాడుతున్నారు. పక్షి రాజు గెటప్ లో అక్షయ్ కుమార్ "ఫేక్ న్యూస్ ను ఫార్వర్డ్ చేసే ప్రతి ఒక్కరు హంతకులే" అంటూ నినదిస్తున్నాడు. ఈ పోస్టర్ ను తయారు చేసి ఫేక్ న్యూస్ ను అరికట్టే చర్యలలో భాగంగా నెటిజనులను చైతన్యపరుస్తున్నారు.  '2.0' సినిమాలో అక్షయ్ కుమార్ సెల్ ఫోన్ వాడేవాళ్ళు అందరూ హంతకులే అంటూ పక్షి జాతి తరపున ఫైట్ చేస్తాడు కదా ఇప్పుడు అదే పాత్రను ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు వాడుతున్నారు.

నాగ్ పూర్ పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి నెటిజనుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఏదేమైనా పోలీసుల పక్షిరాజు సహాయంతో ప్రచారం '2.0' సినిమాపై క్రేజ్ మరింత పెరిగేందుకు సహాయపడుతోంది.  ఇప్పటికే విజయవంతమైన హిందీ వెర్షన్ కు ఇది మరింతగా కలిసి వచ్చే అంశమే.
Tags:    

Similar News