చైత‌న్య‌ రేంజ్ ని త‌గ్గించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని నాగ్!

Update: 2022-07-04 06:39 GMT
వాస్త‌వానికి యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య ప‌రిచ‌యం చిత్రం 'కొత్త బంగారు లోకం' అవ్వాలి. కానీ 'జోష్' తో ప‌రిచ‌యం అయ్యాడు.  ప‌రిచ‌య బాద్య‌త‌లు తీసుకుంది శ్రీవెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు. నాగార్జున ఎంతో న‌మ్మ‌కంతోనే రాజు గారి చేతుల్లో చైత‌న్య ని పెట్టారు. ఆ క్ష‌ణ‌మే చైని స్టార్ ని చేసే బాధ్య‌త ప్ర‌త్య‌క్షంగా  రాజుగారు తీసుకున్న‌ట్లు అయింది.

కానీ అన్నీ తారు మారు అయ్యాయి. 'కొత్త బంగారు లోకం' పెద్ద   హిట్ అయింది. 'జోష్' ప్లాప్ అయింది. మ‌రి ఇలా ఎందుకు జ‌రిగింది?  'కొత్త బంగారు లోకం'లో చైత‌న్య ఎందుకు న‌టించ‌లేదు? 'జోష్' వైపు ఏ కార‌ణం చేత మొగ్గు చూపున‌ట్లు అంటే?  దీని వెనుక చాలా పెద్ద క‌థే ఉం ద‌ని తెలుస్తోంది. నాగ‌చైత‌న్య‌కి ప‌ర్పెక్ట్ గా 'కొత్త బంగారు లోకం' క‌థ అయితే బాగుంటుంద‌ని రాజుగారు అదే క‌థ‌ని నాగార్జున‌కి వినిపించారు.

కానీ లెజెండ‌రీ ఫ్యామిలీ న‌టుడు. ఇలాంటి క‌థ‌తో లాంచ్ అయితే ఊపు రాదు. అక్కినేని అనే బ్రాండ్ తో రావాల‌ని నాగ్ సంకల్పించి ఆ క‌థ వ‌ద్ద‌న్నారు. ఆ త‌ర్వాత రాజుగారు  'జోష్'  క‌థ నేరేట్ చేయ‌డం జ‌రిగింది.  కాలేజ్ బ్యాక్ డ్రాప్ రాజ‌కీయం..యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉండ‌ట‌లం స‌హా ..'శివ‌' మూలాలు కనిపించ‌డంతో చైకి ఇదే ప‌ర్పెక్ట్ స్టోరీ అవుతుంద‌ని నాగ్ లాక్ అయ్యారు.

సినిమా షూటింగ్ పూర్తిచేయ‌డం..అక్కినేని  బ్రాండ్ తో జోష్ ని భారీ ధ‌ర‌కి డిస్ర్టిబ్యూట‌ర్ల‌కి విక్ర‌యించ‌డం అన్ని సంతోషంగానే జ‌రిగాయి. కానీ ఆయ‌న‌కి ఎక్క‌డో ఏదో అసంతృప్తి తొలి నుంచి వెంటాడింది. ఇదే విష‌యాన్ని రాజుగారు నాగ్ ముందు ఉంచారు. భారీ ధ‌ర‌కు అమ్మాం. పంపిణీదారుల ధ‌ర‌ల్లో వెసులుబాటు క‌ల్పింద్దాం అన్న ప్ర‌పోజ‌ల్ నాగ్ ముందు ఉంచారుట‌.

కానీ అందుకు నాగ్ ఏమాత్రం ఇష్ట‌ప‌డలేదుట‌. దేనికి సందేహం..ముందుకెళ్లండ‌ని నాగ్ ధైర్యం ఇచ్చారుట‌. రాజుగారు ఎలాగూ అప్ప‌టికి పెద్ద నిర్మాత‌.. పంపిణీదారుడు.. ఫ‌లితం తేడాగా వ‌చ్చినా త‌ర్వాత సినిమా లో చూసుకుందాం అన్న ధీమాతో మందుకెళ్లిపోయారు.  ఫ‌లితం  రాజుగారు అనుకున్న‌ట్లుగానే వ‌చ్చింది. బంగారం పెద్ద హిట్ అయింది.

జోష్ ప్లాప్ అయింది. అయితే జోష్ రిలీజ్ కి అది స‌రైన స‌మ‌యం కాద‌న్న‌ది రాజుగారి అభిప్రాయం స‌హా మ‌రో కార‌ణంగా తెలుస్తోం ది. అదే స‌మ‌యంలో వైఎస్సార్ హెలికాప్ట‌ర్ ప్రమాదంలో చ‌నిపోవ‌డం..ఆయ‌న రాజుగారి కుటుంబానికి ఆప్తులు కావ‌డం..థియేట‌ర్లు బంద్ పెట్ట‌డం ఇలా కొన్ని స‌మ‌స్య‌లు రాజుగార్ని మ‌నసికంగా  అప్ప‌ట్లో దెబ్బ తీసిన‌ట్లు చెప్పుకొచ్చారు.

అలా నాగార్జున  త‌న‌యుడి విష‌యంలో చేసిన  కొన్ని త‌ప్పిదాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.  ఇక్క‌డ అక్కినేని బ్రాండ్ ఇమేజ్ని..చైత‌న్య‌ని ఏమాత్రం త‌గ్గించ‌డానికి  వీలు లేదు! అన్న వైఖ‌రి హైలైట్ అవుతుంద‌ని తెలుస్తుంది. 'కొత్త బంగారు' లోకం సినిమాతో లాంచ్ అయితే చైతన్య పెద్ద స్టార్ అవ్వ‌లేడా? ఆ  సినిమాలో న‌టించిన వ‌రుణ్ సందేశ్ ఆ ఒక్క స‌క్సెస్ తోనే ఎన్నో అవ‌కాశాలు అందుకున్నాడు.

'హ్యాపీ డేస్' లో న‌లుగురిలో ఒక్క‌డిగా నిలిచిన వ‌రుణ్ ని సోలా స్టార్ గా నిల‌బెట్టింది ఆ సినిమానే. కొత్త హీరో  విష‌యంలో పంపిణీదారుల‌కు ధ‌ర‌ల్లో వ్య‌త్యాసం క‌ల్పిస్తే వ‌చ్చే న‌ష్టం? ఏంటి ? వంటి ప్రశ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి.
Tags:    

Similar News