రా రండోయ్ వేడుక చూద్దాం మూవీ విషయంలో నాగార్జున ముందు నుంచి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ విషయంలో ప్రతీ ప్రెస్ మీట్ లోనూ ఆయన మాటల్లోనే కనిపించింది. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అయితే.. ఈ మూవీలోని ప్రధాన నటులను పొగడ్డంతోపాటు.. నాగ్ మరోసారి అక్కినేని అభిమానుల ఉత్సాహాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయారు.
'మా డోల్ రాణి భ్రమరాంబ.. ఈమెను ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్ లోనే చేసింది. కానీ ఈ సినిమాలో హాఫ్ శారీస్ తో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం తర్వాత హాఫ్ శారీస్ మళ్లీ ఓ ఫ్యాషన్ ట్రెండ్ అయిపోవడం ఖాయం. ఇక పెర్ఫామెన్స్.. యాక్టింగ్ లను భ్రమరాంబగా చేసింది. థ్యాంక్యూ రకుల్' అన్న నాగార్జున చైతు గురించి చెప్పేందుకు మొదట కొంచెం ఆలోచించారు. 'కొడుకు గురించి తండ్రి ఎక్కువ పొగడకూడదు. కానీ ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ ని.. తండ్రిని కాదు. ఒక ప్రొడ్యూసర్ గా చెబుతున్నాను.. నా సినిమా సూపర్.. హీరో సూపర్ గా చేశాడు' అన్నారు నాగ్.
'మీరు చైతును ఎలా చూడాలని అనుకుంటున్నారో.. ఎలా బటన్స్ తెగాలని అనుకుంటున్నారో.. హలో బ్రదర్ సినిమాలో నేను ఎలా ఓపెన్ అయిపోనా.. అలా ఆల్ రౌండ్ గా కంప్లీట్ గా చేశాడు. ఈ మూవీ తర్వాత మీరు కొత్త నాగచైతన్యను చూస్తారు. అతనితో ప్రేమలో పడిపోతారు. మై హీరో సూపర్. అలాగే జగపతి బాబు.. సంపత్.. లాంటి అందరి కేరక్టర్స్ ను కొత్తగా చూస్తారు' అన్న నాగార్జున.. సోగ్గాడే చిన్ని నాయన ఫంక్షన్ లో ఏం చెప్పానో గుర్తుందా.. అని అడిగారు.. 'వస్తున్నాం.. మళ్లీ కొడుతున్నాం.. ఇది ఫిక్స్' అంటూ తన స్పీచ్ ముగించారు నాగార్జున.