కార్తి చెప్పిన ఆ మాట నాగార్జునని టచ్ చేసిందా..!

Update: 2022-10-20 04:27 GMT
తానెంత స్టార్ హీరో అయినా సరే కాలిక్యులేషన్స్ లో పర్ఫెక్ట్ గా ఉంటాడు కింగ్ నాగార్జున. ఆయన చేస్తున్న సినిమాలతో పాటుగా అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక సినిమా వస్తుంది అంటే అదికూడా బయట సినిమా వస్తుంది అంటే అది చాలా గొప్ప విషయం. ముందు చెప్పినట్టుగా నాగార్జున పైకి అంత జోవియల్ గా కనిపించినా ఆయన లెక్కలు వేరేలా ఉంటాయి.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తమిళ హీరో కార్తి నటించిన సర్ధార్ సినిమా రిలీజ్ అవుతుంది. పి.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ మూవీని తెలుగులో నాగార్జున రిలీజ్ చేస్తున్నారు.

ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క అన్నపూర్న స్టూడియోస్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు నాగార్జున. అందరి హీరోలతో మంచి రిలేషన్ ఉన్న నాగార్జున తమిళ హీరో కార్తీతో కూడా ఊపిరి టైం నుంచి మంచి బాండింగ్ కొనసాగిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి సినిమాలో నాగార్జున, కార్తీ కాంబో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ రిలేషన్ తోనే కార్తీ నటించిన సర్ధార్ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు నాగార్జున.

అయితే సర్ధార్ ఎందుకు నాగార్జున రిలీజ్ చేస్తున్నారు అంటే కార్తీ చెప్పిన ఒక్క మాట తనని ఇంప్రెస్ చేసిందని అన్నారు. ఇంతకీ కార్తీ ఏమన్నాడు అంటే ఈ సినిమా చేసినందుకు నాకు గర్వంగా ఉందని అన్నారట. ఆ ఒక్క మాట సర్ధార్ సినిమా తెలుగులో రిలీజ్ చేసేలా చేసిందని అన్నారు నాగార్జున.

కార్తీ మంచి నటుడని.. అన్నయ్యలు సూపర్ స్టార్స్ అయితే వారి నీడలోంచి బయటకు వచ్చి సొంత ఇమేజ్ తెచ్చుకోవడం కష్టమని. అలాంటి వారిలో కార్తీ కూడా ఉన్నారని అన్నారు నాగార్జున. ఈ క్రమంలోనే కార్తీని పవన్ కళ్యాణ్, పునీత్ రాజ్ కుమార్ లతో పోల్చుతూ మాట్లాడారు. ఈవెంట్ లో కార్తీ కూడా నాగార్జున మీద ఉన్న అభిమానాన్ని పాట రూపం లో చూపించాడు. కన్నుల్లో నీ రూపమే అంటూ నిన్నే పెళ్లాడతా సినిమాలో సూపర్ హిట్ సాంగ్ పాడి కింగ్ ఫ్యాన్స్ ని అలరించాడు కార్తీ.

తమిళ హీరోనే అయినా తెలుగు బాగా మాట్లాడే కార్తీ అంటే తెలుగు ప్రేక్షకులకు మంచి అభిమానం. కార్తీ ఖైదీ తెలుగులో సూపర్ హిట్ కాగా సర్ధార్ కూడా అదే ఫలితాన్ని అందించాలని తెలుగు ప్రేక్షకులను కోరారు హీరో కార్తీ.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News