వీళ్లకి ఏజ్ ఎప్పటికీ పెరగదా?

Update: 2016-03-07 11:30 GMT
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున-ఆయన బెటర్ హాఫ్ అమల.. అసలు వీళ్లిద్దరికీ ఏజ్ ఎప్పటికీ పెరగదా అనేది పెద్ద డౌట్. మొన్నటి వరకూ నాగ్ ఒక్కడినే ఇలా అనుకునేవాళ్లం, కుర్ర హీరోలకు సమానంగా రొమాన్సులు, సినిమాలు చేయడమే కాదు.. ఏ తరం వాళ్లతో పోల్చుకున్నా హ్యాండ్సమ్ గా కనిపించగలగడం నాగ్ ఒక్కడికే సాధ్యం. ఆయన భార్య అమల కూడా ఇప్పుడు అలాగే ఉంటున్నారు.

రీసెంట్ గా వీరిద్దరూ కలిసి హైద్రాబాద్ లో జరిగిన ఓ భారీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఈవెంట్ కు వచ్చారు. ఇది ఫుల్ వైట్ కలర్ డ్రస్ కోడ్ మెయింటెయిన్ చేసే ఈవెంట్ కావడంతో.. వీళ్లు కూడా అలాగే వచ్చారు. వైట్ అండ్ వైట్ లో ఈ జంట మిలమిల మెరిసిపోయారు. ఇలా ఒకరి చేతిలో ఒకరు చెయ్యి  వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే.. ఈ తరం యంగ్ కపుల్ కి ఏ మాత్రం తగ్గలేదు. అసలు వీళ్లిద్దరికీ కలిపి ఈ యంగ్ ఫిలిం హీరో అయిన అఖిల్ అంతటి పెద్ద కొడుకు ఉన్నాడంటే నమ్మబుద్ధేయదు కూడా. నాగార్జున - అమల బ్యూటిఫుల్ కపుల్ అనే విషయం టాలీవుడ్ లో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.

వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు కూడా అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడైనా సరే సరైన స్క్రిప్ట్ దొరికితే అమలతో కలిసి నటిస్తానని రీసెంట్ గా అన్నారు నాగ్. ఇప్పుడిలా వీరిద్దరినీ యంగ్ కపుల్ రేంజ్ లో చూస్తుంటే.. మరోసారి తెరపై వీరిద్దరూ కలిసి కనిపిస్తే బాగుండని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News